SIKANDAR Trailer: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'సికందర్'. 'టైగర్' తర్వాత చాలా గ్యాప్ తో రాబోతున్న ఈమూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. థియేటర్స్ లో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ అనుభవాన్ని కలిగించేలా ట్రైలర్ సాగింది.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి
#SikandarTrailer OUT NOW🔥 https://t.co/XYA07aKPQb #Sikandar releases in theatres near you on 30th March 2025 #SajidNadiadwala’s #Sikandar
— Salman Khan (@BeingSalmanKhan) March 23, 2025
Directed by @ARMurugadoss @iamRashmika #Sathyaraj @TheSharmanJoshi @MsKajalAggarwal @prateikbabbar #AnjiniDhawan @jatinsarna…
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సికందర్ ట్రైలర్
ప్రేమ, వైలెన్స్, యాక్షన్, డ్రామా, న్యాయం కోసం పోరాడే తత్వం వంటి ఎమోషన్స్ తో సల్మాన్ పాత్ర ఆకట్టుకుంటోంది. సికిందర్ గా సల్మాన్ పాత్రను ఎంతో శక్తివంతంగా చూపించారు. అలాగే రష్మిక- సల్మాన్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా.. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కిషోర్, శర్మన్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 'గజిని' ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్ ఈ సినిమాను తెరకెక్కించడం మూవీపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
telugu-news | latest-news | sikandar-movie | salman-khan
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!