Sikandar Movie: సల్మాన్, కాజల్, రష్మిక.. సికందర్ హొలీ సాంగ్ అదిరిపోయింది! చూశారా

సల్మాన్ ఖాన్ సికందర్ నుంచి సెకండ్ సింగిల్ 'బామ్ బామ్ భోలే' పాటను రిలీజ్ చేశారు. హొలీ నేపథ్యంలో సాగే సల్మాన్ ఎంట్రీ, డాన్స్ అదిరిపోయాయి. ఇందులో రష్మికతో పాటు కాజల్ కూడా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటను మీరు కూడా చూసేయండి.

New Update

Sikandar Movie: ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'సికందర్'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.  'బామ్ బామ్ భోలే' అంటూ హొలీ పండగ  నేపథ్యంలో సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీతం మ్యూజిక్ అందించిన ఈ పాటకు సమీర్ అంజాన్ సాహిత్యం రాశారు. షాన్,  దేవ్ నేగి ఆలపించారు. 

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

'సికిందర్' లో కాజల్ కూడా 

పాటలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ, డాన్స్, విజువల్స్ అదిరిపోయాయి. అయితే ఇందులో రష్మికతో పాటు కాజల్ అగర్వాల్ కూడా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో  'సికందర్'  కాజల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. కాజల్ పాత్ర ఏంటి? అనేది మాత్రం ఇంకా సస్పెన్సే.  సమీర్ అంజాన్ రాసిన ఈ పాటను షాన్ మరియు దేవ్ నేగి పాడారు. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కిషోర్, శర్మన్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  'టైగర్'  తర్వాత రెండేళ్ల గ్యాప్ తో సల్లు భాయ్ నుంచి రాబోతున్న ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

Advertisment
Advertisment
Advertisment