![WhatsApp Image 2025](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/21/0CIjh6HZ2lgRDspsfoNk.jpeg)
WhatsApp Image 2025 Photograph: (WhatsApp Image 2025)
Also Read: ట్రంప్ మొదట సంతకాలు చేసిన పది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవే..
నటుడు సైఫ్ అలీ ఖాన్ బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈరోజు ఆయన లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.#SaifAliKhanAttacked #SaifAliKhanNews #saifalikhanattackcase #RTV pic.twitter.com/IIYXAQNFPf
— RTV (@RTVnewsnetwork) January 21, 2025
Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు
జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని శరణ్ హోసింగ్ సొసైటిలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి దుండగుడు చొరబడి చోరీకి యత్నించాడు. ఆ క్రమంలో అతడిని సైఫ్ ప్రతిఘటారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో సైఫ్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ మెడ, వీపులో కత్తిలో పొడిచాడు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డారు. ఆ క్రమంలో బిగ్గరగా అరవడంతో.. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే సైఫ్‌ను కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించగా.. అతడికి వైద్యులు పలు శస్త్ర చికిత్సలు నిర్వహించారు.
Read also: పుష్ప అంటే బ్రాండ్ అనుకుంటివా.. కాదు బ్యాడ్‌లక్..! ఇది మూడో దెబ్బ
దుండగుడిని అసలు పేరు షరిఫుల్ ఇస్లాం షెహజాదీ..
అనంతరం ఐసీయూకి తరలించారు. సైఫ్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. ఈ దాడి చేసిన దుండగుడిని సైఫ్ అలీ ఖాన్ నివాసం వద్దనున్న సీసీ కెమెరాల ద్వారా గుర్తించి.. అతడి ఫొటో విడుదల చేశారు. థానేలో దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పేరు విజయ్ దాస్ అని.. బంగ్లాదేశ్ నివాసి అని.. అయితే మారు పేర్లతో సంచరిస్తాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అతడి అసలు పేరు.. షరిఫుల్ ఇస్లాం షెహజాదీ అని.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అతడు అక్రమంగా ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు.
Also Read: కుంభమేళాలో అదానీ సేవ.. ప్రతి రోజు లక్ష మందికి అన్నదానం