![saif ali khan](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/16/Fiq358P78eQfrWojCxiY.jpg)
saif ali khan
Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి కొందరు దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. వెన్నుముకలో కట్టి సగభాగం వరకు ఇరుక్కుపోవడంతో డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. ప్రస్తుతం అలీ ఖాన్ పరిస్థితి బాగానే ఉంది. త్వరలోనే అతను డిశ్చార్జ్ కాబోతున్నారు. అయితే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి బిల్లుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
ఆసుపత్రి ఫీజు ఇన్ని లక్షలా..
ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఖాన్‌కి చికిత్స చేశారు. అయితే డాక్టర్లు ఫీజు, ఖర్చులు, మందు బిల్లులతో అంతా కలిపి రూ.36 లక్షలు అయినట్లు సమాచారం. ఇందులో రూ.25 లక్షలు భీమా కంపెనీ అందించింది. అయితే ఈ చికిత్స ఫీజుతో ఎన్నో కుటుంబాలు బతకవచ్చని నెటిజన్లు అంటున్నారు. సామాన్యులకు ఇలాంటిది ఏదైనా సమస్య వస్తే ఇంత ఖర్చు పెట్టాలంటే కష్టమే అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!
ఇదిలా ఉండగా ముంబై బాంద్రాలో సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో దొంగ సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ వెన్నెముక తీవ్రంగా గాయపడింది. శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. దీంతో సైఫ్ తనయుడు ఇబ్రహీం వెంటనే తండ్రిని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. సైఫ్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, వెన్నెముక భాగంలో పొడవడంతో అందులో ఉండే ద్రవం బయటకు వచ్చిందని డాక్టర్లు అన్నారు. కత్తిని బయటకు తీసి గాయాన్ని సరి చేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు
ఇది కూడా చూడండి: Honey trap: టీ కోసం ఇంటికి పిలిచి.. బట్టలిప్పి టెంప్ట్ చేసి: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!