బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ముంబైలోని బాంద్రాలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో ఇప్పటికే కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి సమయంలో నిందితుడు జనవరి 16 రాత్రి 1:37 గంటలకు ఓ వ్యక్తి చెప్పులు లేకుండా మెట్లు ఎక్కాడు. నారింజ రంగు మఫ్లర్‌ను ముఖానికి కప్పుకుని, ఇంటి గోడను దూకాడు. ఇంటిపైకి వెళ్లిన 55 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి మళ్లీ రాత్రి 2:33 గంటలకు తిరిగి అదే మెట్లు దిగుతూ వచ్చాడు. చెప్పులు లేకుండా పైకి వెళ్లిన అతను బూట్లు వేసుకుని తిరిగి వచ్చాడు. అయితే బ్యాగ్‌లో బూట్లు వేసుకుని వెళ్లాడా? లేకపోతే అలీఖాన్ షూస్ వేసుకుని వచ్చాడా? అనే విషయం పూర్తిగా తెలియదు.
ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
ఏదో శబ్ధం వినిపించగా..
ఆ రోజు అర్థరాత్రి 1.40 నుంచి 1.45 మధ్య సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి.. తన దగ్గర ఉన్న తాళాలతో ఇంటి తలుపులు తెరిచి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దాడి చేసే సమయానికి ఇంటిలో మొత్తం ఏడుగురు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, ఆమె ఇద్దరు కుమారులు తైమూర్, జహంగీర్ ఉన్నారు. వీరితో పాటు ఇంట్లో ముగ్గురు సిబ్బంది కూడా ఉన్నారు. రాత్రి 11 గంటలకు ఖాన్ కుటుంబం అంతా నిద్రపోయారు. సరిగ్గా 2 గంటల సమయంలో ఇస్మాకు జహంగీర్ గది బయట ఉన్న బాత్‌రూం నుంచి ఏదో శబ్దం వినిపించింది.
ఇది కూడా చూడండి: budget 2025-26 బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌కు గుడ్‌న్యూస్..!
అప్పుడే ఇస్మాకు కాస్త డౌట్ వచ్చింది. కానీ కరీనా ఏమోనని అనుకున్నాడు. అప్పుడే తలపై టోపీ ధరించి ఉన్న నీడ కూడా కనిపించింది. అప్పుడు ఆ వ్యక్తి ఇస్మాను సైగలతో బెదిరించి జహంగీర్ గది వైపు వెళ్లాడు. శబ్ధం చేయవద్దని మెల్లగా బెదిరించాడు. దీంతో ఇస్మాన్ నీకు ఏం కావాలని అడగ్గా.. కోటి డబ్బు కావాలని డిమాండ్ చేశాడట. ఆ నిందితుడు రెండు చేతుల్లో కూడా ఆయుధాలు ఉన్నాయి. దీంతో ఇస్మా కాస్త భయపడ్డాడు. తనని తాను ఏదో విధంగా రక్షించుకోగా.. మణికట్టుకు గాయం అయ్యింది. దీంతో ఆమె ఒక్కసారిగా అరవగా.. కరీనా, సైఫ్ ఇద్దరూ కూడా లేచారు. దీంతో నిందితుడు సైఫ్‌పై దాడి చేశాడు.
ఇది కూడా చూడండి: Urvashi Rautela: సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్
కత్తి, హెక్సా బ్లేడుతో సైఫ్‌పై దాడి చేసినా.. నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ అతను పూర్తిగా అదుపులో రాలేదు. చివరకు ఓ గదిలో అతన్ని బంధించారు. అయితే కొంత సమయం తర్వాత చూస్తే ఆ నిందితుడు కనిపించలేదు. ఆ గదిలో ఉన్న కిటికీలోంచి తప్పించుకుని పారిపోయాడు. సైఫ్ వెంటనే ఇబ్రహీంకు చెప్పడంతో అపార్ట్‌మెంట్ ముందు ఆగి ఉన్న ఆటోలో రక్తంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇదంతా సరిగ్గా అర్ధరాత్రి మూడు గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. సైఫ్ శరీరంపై మొత్తం ఆరు చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు ఇబ్రహీం గుర్తించాడు. అయితే ఈ దాడి కేసులో పోలీసులు మొత్తం 35 బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కానీ ఇప్పటికీ నిందితుడు ఆచూకీ తెలియలేదు.