Saiee Manjrekar: వైట్ టీ షర్ట్‌లో మంజ్రేకర్.. కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తుందిగా!
సాయి మంజ్రేకర్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగులో మేజర్ సినిమాతో అలరించింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా వైట్ టీ షర్ట్‌లో, కిల్లింగ్ లుక్స్‌లో ఉండే ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్ ది వే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న "ది రాజా సాబ్" నుంచి మే మద్యలో భారీ అప్‌డేట్ రాబోతోందని దర్శకుడు హింట్ ఇచ్చారు. నిర్మాణం ఆలస్యమవడంతో 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీ వాయిదా పడింది.
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ "ది రాజా సాబ్"మూవీ నుండి అప్‌డేట్ రాబోతుందని డైరెక్టర్ మారుతి(Director Maruthi) సోషల్ మీడియా 'X' ద్వారా హింట్ ఇచ్చారు.
చాలా రోజులుగా అభిమానులు ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి కోరిక నెరవేరినట్టు కనిపిస్తోంది. దర్శకుడు మారుతి తన 'X' (ట్విట్టర్) ఖాతాలో ఓ ఆటోపై ప్రభాస్ స్టిల్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “HIGH ALERT…!! HEAT WAVES gonna rise even higher from mid-May!” అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఈ పోస్ట్‌తో మే మద్యలో భారీ అప్‌డేట్ రానుందని స్పష్టమవుతోంది. ఇది టీజర్‌కు సంబంధించినదా? లేక విడుదల తేదీకి సంబంధించినదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
అసలు "ది రాజా సాబ్"ను మొదట 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరో కథానాయికగా కనిపించనున్నారు.