Pushpa-2 : పుష్ప 2 సినిమాకు విషెస్ చెప్పిన మొట్టమొదటి మెగా హీరో పుష్ప2 చిత్రానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. By Seetha Ram 04 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2’. ఈ చిత్రం రేపు అంటే డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా చూసేందుకు బన్నీ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా మూవీ యూనిట్‌కి చాలా మంది ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. పుష్ప టీమ్‌కి ఆల్ ది బెస్ట్ అదే సమయంలో ఓ మెగా హీరో సైతం పుష్ప 2 సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం బన్నీ ఫ్యాన్స్ లో మరింత ఉత్తేజాన్నిచ్చింది. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పుష్ప2 మూవీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్! ఇప్పటి వరకు అల్లు వెర్సస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఎప్పుడైతే బన్నీ తన ఫ్రెండ్, వైసీపీ నాయకుడు అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎన్నికల సమయంలో మద్దతు తెలిపాడో అప్పటి నుంచి టీడీపీ, జనసేన పార్టీ నాయకులకు టార్గెట్ అయ్యాడు. Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! అది అక్కడితో ఆగకుండా మెగా ఫ్యామిలీని సైతం పాకింది. ఎప్పుడైతే బన్నీ శిల్పా రవికి మద్దతు ఇచ్చాడో.. మరు క్షణమే.. నాగబాబు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశాడు. మనవాళ్లు పరాయివాళ్లు అయ్యారు.. పరాయివాళ్లు మనవాళ్లు అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి మొదలైంది. అల్లు వెర్సస్ మెగా సోషల్ మీడియా వార్. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? అక్కడ నుంచి బన్నీ ఈవెంట్లలో పాల్గొని తనకు ఏది నచ్చితే అదే చెప్తానని అనడం.. తన ఫ్రెండ్‌కి మాట ప్రకారమే అతడికి మద్దతు తెలిపానని చెప్పాడు. తనకు పార్టీలతో సంబంధం లేదని మాట ఇచ్చానంటే అవతల ఎలాగున్నా వస్తానని అన్నాడు. ఈ విషయంలో తగ్గేదే లే అన్నట్లు మాట్లాడాడు. Also Read : కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది? ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగగా.. ఒక్క మెగా హీరో కూడా రాలేదు. చిరంజీవి వస్తారని అంతా ఎదురుచూశారు. చిన్న చిన్న ఈవెంట్లకు వెళ్లే చిరు.. బన్నీ సినిమా ఈవెంట్‌కు రాకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ గొడవ వల్లే చిరు రాలేదని చర్చించుకున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషెస్ చెప్పడం అంతా ఆశ్చర్యపోతున్నారు. Wishing all the best to the entire team of #Pushpa2TheRule.Sending my heartfelt and blockbuster wishes to @alluarjun #Bunny , @aryasukku sir, #FahadhFaasil, @ThisIsDSP , @iamRashmika @resulp @SukumarWritings , @MythriOfficial , and the entire team. 🤗 pic.twitter.com/VMUb4GLvuu — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2024 #allu-arjun #pushpa-2 #sai-dharam-tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి