/rtv/media/media_files/2025/03/15/3aIO960jO1UbrRZC4miI.jpg)
David warner first look
Robinhood: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్' లో వార్నర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
From BATTING to SHOOTING!!!
— nithiin (@actor_nithiin) March 15, 2025
From cricket field to the film field
Welcome Brother @davidwarner31 pic.twitter.com/NPBTLvS1yn
డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్
బ్యాటింగ్ నుంచి షూటింగ్ వరకు!!! క్రికెట్ ఫీల్డ్ నుంచి సినిమా ఫీల్డ్ వరకు.. వెల్కమ్ బ్రదర్ అంటూ వార్నర్ పోస్టర్ షేర్ చేశారు. పోస్టర్ లో వార్నర్ స్టైలిష్ గా కనిపించారు. వార్నర్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అతని భారీ ఫాలోయింగ్ కారణంగా సినిమాపై, అలాగే బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా మంచి ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల ఫీమేల్ లీడ్ గా నటించగా.. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. మార్చి 28న విడుదల కానుండగా.. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్, అలాగే ప్రీ రిలీజ్ వేడుకలో డేవిడ్ వార్నర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రియులతో పాటు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Supritha Video: ప్లీజ్ సార్ తప్పైపోయింది.. నటి సురేఖవాణి కూతురి గుండెల్లో భయం భయం!