RGV : అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన RGV.. వైరల్ అవుతున్న పోస్ట్

అల్లు అర్జున్ అరెస్ట్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
rgv789

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. బన్నీ అరెస్టు ఆయన కుటుంబాన్ని, సినీ ఇండస్ట్రీ సన్నిహితులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ కేసులో నిన్న సాయంత్రమే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చినప్పటికీ.. పలు కారణాల చేత రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 

ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.. వెంటనే ఆయన తన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలోనే బన్నీని పరామర్శించేందుకు సినీ ప్రముఖులంతా తరలి వచ్చారు. అయితే ఈ అరెస్ట్ పై సెన్షేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Also Read :  అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్న సినీ ప్రముఖులు

Ram Gopal Varma Responds To Allu Arjun

Also Read : పెళ్లయిన 12 ఏళ్లకు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్

 అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు.

1. పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?

2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?

3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?

4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ?

అంటూ RGV ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ కు చాలామంది నెటిజన్స్ సపోర్ట్ చేస్తూ ఆయన చెప్పింది వందశాతం నిజం అంటూ RGV పోస్ట్ కి రిప్లేలు పెడుతున్నారు.

Also Read :  స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు

#tollywood #Allu Arjun #Ram Gopal Varma #rgv
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. ...

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment