నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా

హీరోయిన్ రెజీనా కసాండ్రా తన పేరుకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల తనకు మొదట రెజీనా అని ముస్లిం పేరు పెట్టారని, వాళ్ళు విడాకులు తీసుకోవడంతో అమ్మ క్రిస్టియన్ గా మారి కసాండ్రా అనే పేరు యాడ్ చేసిందని తెలిపారు.

New Update
regina casandra

regina casandra

టాలీవుడ్‌లో ఒకప్పుడు జెట్ స్పీడ్ లో సినిమా చేసింది రెజీనా కసాండ్రా. తన సినీ ప్రస్థానంలో యంగ్ హీరోలతో కలిసి పలు హిట్ చిత్రాలు చేసి మంచి గుర్తింపు పొందింది. కెరీర్ ఆరంభంలో ఆఫర్ల కోసం కష్టపడినప్పటికీ, తర్వాత మెగా హీరోలతో పాటు ఇతర యంగ్ హీరోల సినిమాల్లో నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.

అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో ఆమె కెరీర్ కొంత నెమ్మదించింది. దీంతో తెలుగు సినిమాల కంటే తమిళ్, హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది.ఇదివరకు చేసిన హిట్ సినిమాల తర్వాత కూడా స్టార్ హీరోల దృష్టి ఆమెపై పడకపోవడం వల్ల, ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. 

Also Read : 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం తెలుగులో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న రెజీనా, ఇతర ఇండస్ట్రీల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం గురించి వెల్లడించింది. అసలు తన పేరు రెజీనా కసాండ్ర కాదని చెప్పి షాక్ ఇచ్చింది.

అమ్మ వల్లే పేరు మార్చుకున్నా..

" మా అమ్మ క్రిస్టియన్ కాగా, నాన్న ముస్లిం. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మ ముస్లిం మతాన్ని స్వీకరించి, నా పుట్టిన తర్వాత 'రెజీనా' అనే ముస్లిం పేరును పెట్టారు. కానీ, నాకు ఆరేళ్లు వచ్చినప్పుడు మా అమ్మ, నాన్న విడిపోయారు. తర్వాత అమ్మ తిరిగి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి, నా పేరుకు 'కసాండ్ర' జోడించింది. అలా నా పేరు రెజీనా కసాండ్రగా మారింది.." అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

తాను రెండు మతాలను గౌరవిస్తానని చెప్పిన రెజీనా, ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాల్లో మూడు నుంచి నాలుగు ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. త్వరలోనే వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

#latest-telugu-news #regina-cassandra #latest-movie-updates #telugu-film-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు