Upasana konidela: తండ్రిని టీవీలో చూసి క్లింకార అల్లరి.. ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసిన ఉపాసన!

రామ్‌చరణ్, ఉపాసన గారాల పట్టి క్లింకార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా క్లింకార తండ్రి రామ్‌చరణ్‌ను ఫస్ట్ టైమ్ టీవీలో చూసి మురిసిపోతుంది. ఈ వీడియోను స్వయంగా ఉపాసన తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

New Update
 klin kaara viral video

klin kaara viral video Photograph: ( klin kaara viral video)

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ, ఉపాసన గారాల పట్టి క్లింకార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా క్లింకార తన తండ్రి రామ్‌చరణ్‌ను ఫస్ట్ టైమ్ టీవీలో చూసి మురిసిపోతుంది. రామ్ చరణ్, జక్కన్న కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను క్లింకార్ చూస్తూ అల్లరి చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఉపాసన తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో క్లింకార ఫేస్ కనిపించకుండా ఉపాసన పోస్ట్ చేశారు. దీంతో క్లింకార ఎంత క్యూట్‌గా ఉందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..

ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు..

2023 జూన్ 20న ఉపాసన క్లింకారకు జన్మనిచ్చింది. అయితే ఆమె పుట్టి దాదాపుగా 19 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఆమె పూర్తి ఫేస్ కూడా బయటకు రాలేదు. పలు సందర్భాల్లో క్లింకారకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ ఆమె ఫేస్‌ను బ్లర్ చేశారు. ఫస్ట్ టైమ్ క్లింకారను బ్లర్ చేయకుండా ఉండే వీడియోను ఉపాసన విడుదల చేసింది. కానీ ఈ వీడియో ఉపాసన ఫేస్ రివీల్ చేయకుండా వెనుక నుంచి ఉన్న వీడియోను ఆమె పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి:  Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు