గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 10 న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. రిలీజ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ ఇటీవల యూ ఎస్ లోని డల్లాస్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా గెస్ట్ గా వెళ్లారు. అయితే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ - అభిమానికి మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అభిమాని తన ఫోన్ లో సెల్ఫీ అడిగాడు. Fan thana phone lo selfie adigite , Charan anna selfie thisaka mobile thanki ki ivvakunda marchipoyadu 🤣😭Annaa @AlwaysRamCharan 😭😭 pic.twitter.com/tRaNCXfpfV — Em chesadra vadu🚁 (@virat_ram_18) December 27, 2024 Also Read : 'గుంటూరు కారం' రీ రిలీజ్.. అన్ని షోస్ హోస్ ఫుల్, రమణగాడా మజాకా! దాంతో రామ్ చరణ్ అభిమాని ఫోన్ తీసుకోని తానే స్వయంగా సెల్ఫీ తీశాడు. ఆ తర్వాత ఫోన్ అతనికి ఇవ్వడం మర్చిపోయాడు. దాంతో ఈవెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఈ విషయాన్ని గమనించి.. చరణ్ కు సైగ చేశాడు. అప్పటికీ చెర్రీ రియలైజ్ అవ్వకపోవడంతో ఆ వ్యక్తి చరణ్ ను పక్కకు పిలిచి అభిమాని ఫోన్ మీ దగ్గరే ఉండిపోయిందని చెప్పడంతో అప్పుడు రామ్ చరణ్ కోలుకొని ఫోన్ తిరిగి ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక 'గేమ్ ఛేంజర్' విషయానికొస్తే.. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ప్రియదర్శి ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. Also Read : న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే!