/rtv/media/media_files/2026/06/05/peddi-2026-06-05-16-41-25.jpg)
Peddi
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రిలీజైన ఈ మూవీ మొదటి రోజే భారీ కలెక్షన్లు రాబట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఈ మూవీ రూ.135.36 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బుధవారం రాత్రి జరిగిన ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పండగ మొదలైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి రోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన 11వ తెలుగు సినిమాగా 'పెద్ది' రికార్డు సృష్టించింది.
ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
అన్ని వెర్షన్‌లో కలెక్షన్లు రాబట్టిన పెద్ది..
ఇండియాలో ఫస్ట్ డే రూ.82.49 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నెట్ వసూళ్ల పరంగా రూ.69.50 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇందులో ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ. 18.50 కోట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మొదటి రోజు సుమారు రూ.48 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. లాంగ్వేజ్ పరంగా చూస్తే.. తెలుగు వెర్షన్ నుంచి మొదటి రోజు రూ.47.20 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. హిందీ వెర్షన్ ద్వారా రూ.3 కోట్లు రాబట్టగా.. తమిళం నుంచి రూ.45 లక్షలు, కన్నడ నుంచి రూ.25 లక్షలు, మలయాళం నుంచి రూ.10 లక్షల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. కేవలం సౌత్‌లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇది కూడా చూడండి: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!
Box office CHAMPION - #PEDDI SIR
— PEDDI (@PeddiMovieOffl) June 5, 2026
💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️🔥❤️🔥
Meet #PEDDI now in cinemas ❤️🔥
Book your tickets now 💥💥https://t.co/EMhY3eMGKqpic.twitter.com/1WYLZ3215U
ఇది కూడా చూడండి: Annamalai's resignation : అన్నామలై రాజీనామా ఆమోదం..కొత్తపార్టీ దిశగా అడుగులు
రామ్ చరణ్ కెరీర్‌లో ఆర్ఆర్ఆర్ తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాదు గతంలో విడుదలైన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'పఠాన్' తొలిరోజు రూ.104 కోట్ల వసూళ్లు సాధించింది. అలాగే ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' తొలిరోజు రూ.100.9 కోట్లు రాబట్టింది. ఈ రెండు సినిమాల రికార్డులను కూడా 'పెద్ది' బ్రేక్ చేసింది.
ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
Follow Us