/rtv/media/media_files/2025/02/11/77alY50VGGgrCOFX2oI6.jpg)
ram charan African parrot
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఫ్యామిలీ, సినిమాలతో పాటు పెట్స్ అంటే కూడా చాలా ఇష్టం. చరణ్, ఆయన వైఫ్ ఉపాసన ఇంట్లో రకరకాల పక్షులను, జంతువులను పెంచుతుంటారు. వారికి రైమ్ అనే ఒక కుక్కపిల్ల కూడా ఉంది. చరణ్ ఎక్కడికి వెళ్లిన దానిని వెంట తీసుకొని వెళ్తారు. అంతేకాదు అది రామ్ చరణ్ తో పాటు తన బెడ్ పైనే పడుకుంటుందట. రైమ్ తో పాటు చరణ్ కి బాద్‌షా, కాజల్, బ్లేబ్ అనే గుర్రాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు కుట్టి అనే ఆఫ్రికన్ జాతికి చెందిన చిలుక కూడా ఉంది. దీన్ని చూపిస్తూనే చరణ్ రోజూ తన కూతురికి అన్నం తినిపించడం, ఆడించడం చేసేవారట.
తప్పిపోయిన చరణ్ చిలుక
అయితే తాజాగా ఆ కుట్టి అనే చిలుక తప్పిపోయింది. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. జుబ్లీహిల్స్ ఏరియాలోని రోడ్ నెంబర్ 25లో ఆఫ్రికన్ కుట్టి తప్పిపోయిందని..ఎక్కడైనా కనిపిస్తే చెప్పండంటూ పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్ చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ సభ్యులు.. తప్పిపోయి తమకు దొరికిన ఆ చిలుకను రామ్‌చరణ్ దంపతులకు తిరిగి ఇచ్చారు.
ఇంటికి వెళ్ళగానే చరణ్ భుజం పై..
అయితే కుట్టి( చిలుక) రామ్ చరణ్ చూడగానే .. ఆయన భుజం పై వాలిపోయింది. కుట్టి అలా ప్రేమతో భుజం వాలడంతో గ్లోబల్ స్టార్ ఎమోషనల్ అయ్యారు. దాని ప్రేమను చూసి ఏడ్చేశారు. చిలుకను పట్టుకుని మళ్లీ ఇంటికి తిరిగొచ్చేలా సహాయం చేసిన యానిమల్ వారియర్స్ ఆర్గనైజేషన్ టీమ్‌కు చరణ్ దంపతులు కృతజ్ఞతలు చెప్పారు. చరణ్, కుట్టి మధ్య బాండింగ్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. యానిమల్ వారియర్స్ ఆ కుట్టిని ఎలా రెస్య్కూ చేశారనేది తమ సోషల్ మీడియాలో వివరంగా చెప్పారు. ఆఫ్రికన్ గ్రే చిలుక దొరికిందని తమకు ఒక డిస్ట్రెస్ కాల్ వచ్చిందని.. అది ఎవరో ఒకరి పెంపుడు జంతువు అయి ఉంటుందని.. పొరపాటున తప్పించుకుపోయిందని అనుకున్నామన్నారు. వెంటనే కుట్టిని తీసుకెళ్లి పెంపుడు జంతువు సంరక్షణ కేంద్రానికి పంపామని చెప్పారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా ఉపాసన పోస్ట్‌ను చూసి.. వెంటనే వారి సంప్రదించామన్నారు.
Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?