రామ్ చరణ్ కు బిగ్ షాక్.. 'గేమ్ ఛేంజర్'పై ఫిర్యాదు, అప్పటిదాకా రిలీజ్ చేయొద్దంటూ?

కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలను ఆపాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలికి ఫిర్యాదు చేస్తూ.. 'ఇండియన్ 3' షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసేవరకు 'గేమ్ ఛేంజర్' తమిళనాడులో విడుదల చేయవద్దని డిమాండ్ చేసింది.

New Update
game changer

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు కేవలం నాలుగు రోజుల సమయమే ఉంది. ఇలాంటి తరుణంలో మూవీ టీమ్ కి భారీ షాక్ తగిలింది.

కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలను ఆపాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలికి ఫిర్యాదు చేస్తూ.. 'ఇండియన్ 3' షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసేవరకు 'గేమ్ ఛేంజర్' తమిళనాడులో విడుదల చేయవద్దని డిమాండ్ చేసింది.

Also Read :  మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్‌..అసలేమైందంటే!

'ఇండియన్ 3'కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉండగా, ఈ పనులు 'గేమ్ ఛేంజర్' విడుదల అనంతరం పూర్తి చేస్తానని లైకా టీంకు శంకర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు తెలియజేశాయి. 

దీంతో తమిళనాడులో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ శంకర్ ఒప్పందానికి లైకా టీమ్ కన్విన్స్ అవ్వకపోతే తమిళ్ నాడులో 'గేమ్ ఛేంజెర్' రిలీజ్ లేనట్టే అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Also Read : 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు