'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా?

'గేమ్ ఛేంజర్' ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే ఏకంగా 180 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తెలుగులోనే 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా షేర్ చేసింది. 

New Update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా కనిపించనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తెలుగుతో పాటూ తమిళ, హిందీ మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచిన చిత్ర బృందం, ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ లో రామ్ చరణ్ నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో అదరగొట్టారు. 

Also Read: USA: అమెరికా హౌస్ స్పీకర్‌గా  మళ్ళీ మైక్‌ జాన్సన్‌ ఎన్నిక

180 మిలియన్ వ్యూస్..

ముఖ్యంగా కొన్ని యాక్షన్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లోనే ఏకంగా 180 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఒక్క తెలుగులోనే 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టింది. తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ ద్వారా షేర్ చేసింది. 

ఈ ట్రైలర్ విడుదలతోనే 'గేమ్ ఛేంజర్‌'పై ఉన్న భారీ అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ రోజు రాజమండ్రిలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Also Read: Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం

సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి అభిమానులు ఇప్పటికే భారీ సంఖ్యలో వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచి మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు