/rtv/media/media_files/2025/01/12/YGmavkarUOiPYmu0c9ie.jpg)
ram charan game changer
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. జనవరి 10 న భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ నుంచి ప్లాప్ టాక్ వచ్చింది. సినిమా అంతా పాత చింతకాయ పచ్చడిలాగే ఉందని, శంకర్ అవుట్ డేటెడ్ స్టోరీతో విసుగు పుట్టించాడని.. సినిమాకు అంతా నిగిటివ్ నెగిటివ్ రివ్యూలే ఇచ్చారు.
కానీ మూవీ టీమ్ మాత్రం ఓపెనింగ్ రోజేనే 'గేమ్ ఛేంజర్' రూ.186 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్ రిలీజ్ చేసింది. డిజాస్టర్ సినిమాకు అన్ని కోట్ల కలెక్షన్స్ ఏంటని, నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారని పోస్టర్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే సినిమా సెకెండ్ డే నెగిటివ్ టాక్ తగ్గింది. మిక్స్ డ్ టాక్ వచ్చింది. సినిమా అంత వరెస్ట్ గా అయితే లేదని కొందరు చెప్పారు.
Also Read : 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత
A true #GameChanger 🔥
— Sri Venkateswara Creations (@SVC_official) January 12, 2025
Breaking barriers and echoing a blockbuster talk! 💥❤️🔥
Book you tickets now
🔗 https://t.co/ESks33KFP4#BlockBusterGameChanger In Cinemas Now ✨
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman… pic.twitter.com/epnKeHw55Z
అక్కడ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్..
ఇప్పుడు మాత్రం 'గేమ్ ఛేంజర్' కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. అదికూడా నార్త్ నుంచి కావడం విశేషం. నార్త్ లో 'గేమ్ ఛేంజర్' సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా రామ్ చరణ్ పెర్ఫెర్మాన్స్ నెక్స్ట్ లెవెల్, శంకర్ డైరెక్క్షన్, విజువల్స్, సాంగ్స్.. అన్నీ సూపర్ అని, ఫైనల్ గా టైటిట్ కు తగ్గట్లే సినిమా ఉందంటూ అక్కడి ఆడియన్స్ చెబుతున్నారు.
Also Read : ఆరోగ్యంపై వార్తలు.. ఎట్టకేలకు నోరు విప్పిన విశాల్
ఇదే విషయాన్ని దిల్ రాజు టీమ్ వీడియోతో సహా బయటపెట్టింది. 'గేమ్ ఛేంజర్' నార్త్ ఆడియన్స్ పబ్లిక్ టాక్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మూవీ టీమ్..' 'గేమ్ ఛేంజర్' అన్ని బ్యారియర్స్ ను బ్రేక్ చేసుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది..' అంటూ పేర్కొన్నారు. మరి నార్త్ వాళ్లకు నచ్చిన 'గేమ్ ఛేంజర్' మన తెలుగు వాళ్లకు నచ్చక పోవడం గమనార్గం.