/rtv/media/media_files/2025/01/16/s1BTYAqBU4QOz0nuxzcH.jpg)
rajnikanth jailer 2
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమాలో రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన పాత్రను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. ఈ కాంబో నుంచి ఇప్పుడు ‘జైలర్ 2’ రాబోతుంది. నిజానికి పార్ట్-2 అనేది సీక్వెల్ అని అంతా అనుకుంటున్నారు.
కానీ ఇది ‘జైలర్’కు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. రజనీకాంత్ జైలర్‌గా ఎందుకు, ఎలా మారాడు అనే కథను ఈ సారి తెరపై ఆవిష్కరించబోతున్నారు.ఇదిలా ఉంటే ‘జైలర్’ లో గెస్ట్ అప్పియరెన్స్‌లు మెయిన్ హైలైట్ గా నిలిచాయి. సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ గెస్ట్ రోల్స్ లో అదరగొట్టారు. ఇప్పుడు ‘జైలర్ 2’లో కూడా గెస్ట్ రోల్స్‌కు పెద్దపీట వేస్తున్నారు. అయితే డైరెక్టర్ నెల్సన్ ఈసారి టాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే
'జైలర్ 2' కోసం పలురువు టాలీవుడ్ స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. అందులో మొదటగా వినిపిస్తున్న పేరు బాలయ్య. నిజానికి పార్ట్-1 లోనే బాలయ్య ఉండాల్సింది. కానీ మిస్ అయింది. డైరెక్టర్ ఓ సందర్భంలో బాలయ్య అంటే తనకు ఇష్టమని, జైలర్ 1 కోసం ఆయన్ని సంప్రదించాలని భావించానని, అయితే.. బాలయ్య ఒప్పుకొంటారో, లేదో అనే అనుమానంతో ఆ ఆలోచన విరమించుకొన్నానని చెప్పారు.
అయితే ‘జైలర్ 2’ లో బాలయ్య కోసం నెల్సన్ ఓ పవర్ ఫుల్ పాత్ర రాసుకొన్నాడట. ఇందులో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. బాలయ్యతో పాటూ మరో తెలుగు హీరో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో సస్పెన్స్‌గా ఉంచారు. దక్షిణాది ఇండస్ట్రీ నుంచి మరికొంత మంది సూపర్ స్టార్లు కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read : వందకోట్ల క్లబ్ లో చేరిన 'డాకు మహారాజ్'.. సంక్రాంతి విన్నర్ గా బాలయ్య