/rtv/media/media_files/2025/02/13/JltBddEfMPffwhhJtHTw.jpg)
Dhananjaya wedding
Dhananjaya: 'పుష్ప'(Pushpa) సినిమాలో 'జాలిరెడ్డిగా'(Jaali Reddy) తన విలనిజంతో ఆకట్టుకున్న నటుడు ధనుంజయ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పెళ్లి డేట్, వేదికను అనౌన్స్ చేశారు. తాను ప్రేమించిన ధన్యత అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే ధనుంజయ్ వినూత్నంగా తన పెళ్ళికి ఆహ్వానించారు. తన చేతిలో క్లాప్ బోర్డు.. అమ్మాయి చేతిలో స్టెతస్‌స్కోప్ పట్టుకొని ఉన్న ఒక కార్టూన్ పోస్టర్ ని షేర్ చేస్తూ పెళ్లికి ఇన్వైట్ చేశారు.
Also Read: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!
మైసూర్ లో పెళ్లి
ఫిబ్రవరి 15, 16 తేదీల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. మైసూర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగబోతున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి పుట్టి, పెరిగిన ఊరు కావడంతో ధనుంజయ్ అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధనుంజయ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ధన్యత ఒక డాక్టర్. ఆమె చిత్రదుర్గ ప్రాంతానికి చెందినదిగా తెలుస్తోంది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం.. ప్రేమగా మారింది. అదే ప్రేమతో ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు.
Also Read: Raghavendra Rao: మెగా ఛాన్స్ పట్టేసిన భీమ్స్.. స్టేజ్ పై లీక్ చేసిన రాఘవేందర్ రావు
కన్నడలో ధనుంజయ్ హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేశారు. కన్నడ ఆడియన్స్ ఈయనను ముద్దుగా డాలీ అని పిలుస్తారు. పలు సినిమాల్లో ఇతని యాక్టిగ్ చూసి ఫిదా అయిన సుకుమార్ 'పుష్ప' లో విలన్ రోల్ కి తీసుకున్నారు. అంచనాలకు తగ్గట్లే జాలిరెడ్డి పాత్రలో ధనుంజయ్ అదరగొట్టారు.
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు