/rtv/media/media_files/2025/01/18/yCM2yvz0EZQVaD8dE0jG.jpg)
akash puri
తెలుగు సినీ ఇండస్ట్రీలో సహాయనటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా సినీ రంగానికి దూరమైన ఆమె, కష్టసమయాలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులను సాయం చేయాలంటూ వేడుకున్నారు.
" 50 ఏళ్లుగా నటిగా కష్టపడి జీవించాను. కానీ గత మూడు సంవత్సరాలుగా నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా దీనిని వివరించాను. కానీ ఎవరూ స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు కొన ఊపిరితో బతుకుతున్నాను. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి ప్రముఖ హీరోలందరితో నటించాను.
Also Read : జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. MAAకు మాధవీలత ఫిర్యాదు
A Generous Gesture from Young Hero @AkashJagannadh ❤️
— Suresh PRO (@SureshPRO_) January 18, 2025
Hero #AkashJagannadh personally met senior actress #PavalaSymala Garu and donated 1 lakh, promising to stand in support 👏 pic.twitter.com/pKRoYIO7ae
కానీ ప్రస్తుతం ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు వచ్చే స్థితిలో ఉన్నాను. ట్రీట్మెంట్ చేయించుకోలేక బాధపడుతున్నాను. నన్ను ఇలాగే వదిలేస్తారా? దయచేసి నాకు సహాయం చేయండి.." అని శ్యామల తన ఆవేదనను వ్యక్తం చేశారు.ఇక శ్యామల పరిస్థితి గురించి తెలుసుకున్న పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ జగన్నాథ్ వెంటనే స్పందించారు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్
శ్యామల ప్రస్తుతం ఉన్న ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సోసైటీకి వెళ్లి ఆమెను కలిసిన ఆకాశ్, ఆమె పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం శ్యామలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, "ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను," అని భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆకాశ్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.