Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ అదిరిపోయింది మావా.. చూస్తే అరుపులే

కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది. అందులో ప్రభాస్ నుదిటిన నామాలు, చేతిలో విల్లు, మెడలో రుద్రాక్షలు భుజంపై కాషాయం కండువతో ఉన్న స్టిల్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

New Update
prabhas,

Kannappa Prabhas Look:

మంచు విష్ణు హీరోగా చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమా రేంజ్ ను మార్చేశాయి. కాగి ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Also Read: టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం..

అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఇందులో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

దీనిపై మంచు విష్ణు స్పందించాడు. ఫొటో లీక్ చేసిన వారిని పట్టిస్తే భారీగా రివార్డు అందిస్తానని బంపరాఫర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్ ను పోస్ట్ చేశారు. ''ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరి హీరోల ఫ్యాన్స్ కోరుతున్నాం. ఈ సినిమా కోసం దాదాపు 8 ఏళ్లుగా ప్రాణాలు పెట్టి పనిచేస్తున్నాం. రెండేళ్ల నిబద్ధతతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి టీమ్ అంతా రాత్రింబవళ్లు కృషి చేస్తుంది. ఇలాంటి సమయంలో కన్నప్ప మూవీ నుంచి వర్కింగ్ ప్రోగ్రస్ ఇమేజ్ లీక్ కావడం చాలా బాధాకరం. 

Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్

ఈ లీక్ మాతోపాటు సినిమా కోసం పనిచేసే దాదాపు 2000 మందికి పైగా టెక్నీషియన్ల జీవితాలను ఎఫెక్ట్ చేస్తుంది. దీనిపై పోలీసు కేసు కూడా పెడుతున్నాము. ఆ ఫొటో లీక్ చేసిన వారిని పట్టుకోవాలని కోరుతున్నాను. వారిని పట్టుకుంటే రూ.5 లక్షల బహుమతిగా ఇస్తామని తెలిపాడు. దీని గురించి ఏమైనా తెలిస్తే 24 ఫ్రెడ్స్ ఫ్యాక్టరీ ట్విట్ర్ అకౌంట్ కు మెసేజ్ చేయడి'' అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు. 

Also Read: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment