OG : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!

పవన్ కళ్యాణ్ 'ఓజీ' గ్లింప్స్‌ను సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల‌తో క‌లిసి థియేట‌ర్ల‌లో వేయ‌బోతున్నార‌ట. ఈ గ్లింప్స్‌కు సంబంధించి అన్ని పనులు పూర్తవ్వగా.. నిన్ననే సెన్సార్‌ కూడా కంప్లీట్ అయిందట. గ్లింప్స్‌ నిడివి 1.39 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. 

New Update
pawan kalyan OG glimpse

pawan kalyan OG

పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మధ్యలో ఖాళీ సమయం దొరికినప్పుడు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో 'ఓజీ' ఒకటి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్ స్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. 

ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో 'ఓజీ' కి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు సంక్రాంతి పండగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు 'ఓజీ' చిత్ర బృందం సిద్ధమైందట. 

Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

'ఓజీ' నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ గ్లింప్స్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని పనులు పూర్తవ్వగా.. నిన్ననే సెన్సార్‌ కూడా పూర్తయిందని.. గ్లింప్స్‌ నిడివి సుమారు 1.39 నిమిషాలుగా ఉంటుందని తెలుస్తోంది. 

అంతేకాదు, ఈ గ్లింప్స్‌ను సంక్రాంతికి విడుదలవుతున్న 'గేమ్ ఛేంజర్'  సినిమాతో కలిపి థియేటర్లలో ప్రదర్శించాలని మేకర్స్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. సుజిత్ ఈ గ్లింప్స్‌ను ఎలాంటి అద్భుతమైన విజువల్స్‌తో కట్ చేశాడో అనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది. ఇదే నిజమైతే పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్ అనే చెప్పాలి. 

Also Read :  మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ?

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు