OTT Awards 2025: ఓటీటీ అవార్డుల విజేతలు వీరే!

ఓటీటీలో నటించిన నటీనటులు, దర్శకులకు ఓటీటీప్లే వన్ నేషన్.. వన్ అవార్డులను ఇస్తోంది. అయితే ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ఓటీటీలో నటించిన వారికి అవార్డులను ప్రకటించారు. మరి ఈ ఓటీటీ అవార్డుల విజేతలు ఎవరో తెలియాలంటే ఆర్టికల్‌పై లుక్కేయండి.

New Update
OTT Awards

OTT Awards Photograph: (OTT Awards)

ప్రస్తుతం రోజుల్లో అంతా కూడా ఓటీటీ హవానే నడుస్తోంది. చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో వస్తున్నాయి. అయితే వీటిలో నటించిన నటీనటులు, దర్శకులకు ఓటీటీప్లే వన్ నేషన్.. వన్ అవార్డులను ఇస్తోంది. అయితే ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ఓటీటీలో నటించిన వారికి అవార్డులను ప్రకటించారు. మరి ఈ ఓటీటీ అవార్డుల విజేతలు ఎవరో చూద్దాం. 

ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?

సినిమా కేటగిరి

ఉత్తమ సినిమా: గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌ (అలీ ఫజల్‌ అండ్‌ రిచా చద్దా)
ఉత్తమ నటుడు (పాపులర్‌): మనోజ్‌ బాజ్‌పాయ్‌ (డిస్పాచ్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అనుపమ్ ఖేర్‌
ఉత్తమ నటి (పాపులర్‌): కాజోల్‌ (దోపత్తి)
ఉత్తమ దర్శకుడు : ఇంతియాజ్‌ అలీ 
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): పార్వతి తిరువొత్తు (మనోరథంగళ్‌)
ఉత్తమ విలన్‌: సన్నీ కౌశల్‌
ఉత్తమ హాస్యనటి : ప్రియమణి (భామాకలాపం2)
ఉత్తమ నటనా ప్రతిభ: అవినాష్‌ తివారి (ది మెహతా బాయ్స్‌)
ఉత్తమ నటనా ప్రతిభ: షాలినీ పాండే (మహరాజ్‌)

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

వెబ్‌సిరీస్‌ కేటగిరి
ఉత్తమ సహాయ నటి: జ్యోతిక (డబ్బా కార్టెల్‌)
ఉత్తమ నటుడు (పాపులర్‌): రాఘవ్‌ జ్యుయెల్‌ (గయారా గయారా)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): నిమేషా సజయన్‌ (పోచర్‌)
ఉత్తమ వెబ్‌సిరీస్‌ : పంచాయత్‌3
ఉత్తమ దర్శకుడు: నిఖిల్‌ అడ్వాణీ
ఉత్తమ నటి (పాపులర్‌): అదితి రావ్‌ హైదరి (హీరామండి)
ఉత్తమ సహాయ నటుడు : రాహుల్‌ భట్‌
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జైదీప్‌ అహ్లవత్‌ (పాతాళ్‌లోక్‌2)
ఉత్తమ నటనా ప్రతిభ: అభిషేక్‌ కుమార్‌ (తలైవేట్టయాన్‌ పాలయం)
ఉత్తమ నటనా ప్రతిభ: పత్రలేఖ (ఐసీ 814)
ఉత్తమ హాస్య నటుడు: నీరజ్‌ మాధవ్‌ 

ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?

ఓటీటీ స్పెషల్ అవార్డ్స్‌ 
ఉత్తమ టాక్‌ షో వ్యాఖ్యాత: రానా దగ్గుబాటి ది రానా టాక్‌ షో
ఉత్తమ నాన్‌ స్క్రిప్ట్‌ షో: షార్క్‌ ట్యాంక్‌
ట్రయల్‌ బ్లేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: శ్రీమురళి (బఘీర)
ఉత్తమ రియాల్టీ షో : ది ఫ్యాబులస్‌ లైవ్స్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వైవ్స్‌
బహుముఖ ప్రదర్శనా నటి: కని కుశ్రుతి 
ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్‌: ది రోషన్స్‌
పయనీర్‌ కంట్రిబ్యూషన్స్‌ టు న్యూ వేవ్‌ సినిమా: అశ్విన్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌
ట్రయల్‌ బ్లేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: దివ్య దత్‌ 
రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌: అవనీత్‌ కౌర్‌ 
బహుముఖ ప్రదర్శనా నటుడు: సిద్ధాంత్‌ గుప్త 
ప్రామిసింగ్‌ నటి: హినా ఖాన్‌ (గృహలక్ష్మి)
ఉత్తమ పరిచయ వెబ్‌సిరీస్‌ నటి: వేదిక (యక్షిణి)
ప్రామిసింగ్‌ నటుడు: అపరశక్తి ఖురానా (బెర్లిన్‌)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

New Update
peddi ram charan look

peddi ram charan look

గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ ఆసక్తి చూస్తున్న రామ్ చరణ్ సినిమా పెద్ది. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై హైప్స్ పెంచేసిన మూవీ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ దీని కోసం ఆతృతగా ఎదురు చేస్తున్నారు. 

పెద్ది గ్లింప్స్ పై క్రేజీ పోస్ట్ లు..

టైటిల్ ఎంత క్రేజీగా ఉందో ఇందులో చరణ్ లుక్ కూడా అంతే క్రేజీగా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు గ్లింప్స్ శ్రీరామ నవమి రోజు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పెద్ది' మూవీ గ్లింప్స్ ని ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై తాజాగా రామ్ చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  గ్లింప్స్ చూసిన తర్వాత సూపర్ ఉత్సాహంగా ఉంది. ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది అంటూ అందులో రాశారు. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా షేర్ చేసారు. దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అవుతూ ఏఆర్ రెహమాన్, చరణ్ అదరగొట్టారనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.

 

 today-latest-news-in-telugu 

 Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment