Oscar 2025: 97వ ఆస్కార్ వేడుక.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి? - హోస్ట్ ఎవరు? పూర్తి వివరాలివే!

97వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి2న అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ వేడుకను భారతదేశంలో మార్చి 3న ఉదయం 5:30 IST నుండి ప్రారంభం అవుతుంది. దీనిని స్టార్ మూవీస్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. ఈ ఏడాది ఆస్కార్‌లను ఓబ్రియన్ హోస్ట్ చేస్తారు.

New Update
Oscars 2025 97th Academy Awards When and where to watch in India

Oscars 2025 97th Academy Awards When and where to watch in India

వరల్డ్ లోనే ప్రఖ్యాత సినీ అవార్డులలో అత్యంత గొప్ప పురస్కారం ఆస్కార్. ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలు ఆస్కార్ కోసం కలలుకంటూ ఉంటాయి. ఈ అవార్డు సాధించడం ఒక గొప్ప కలగా ఎంతో మంది సినీ తారలకు ఉంటుంది. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుకకు అంతా సిద్ధం అయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు హాలీవుడ్‌లో అత్యంత జరుపుకునే ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

97వ అకాడమీ అవార్డులు మార్చి 2, 2025న అమెరికాలో జరగనున్నాయి. భారతీయ కాలమానం ప్రకారం.. సినిమా ఔత్సాహికులు మార్చి 3, 2025న ఆస్కార్ 2025ని ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ కార్పెట్ ఈవెంట్ IST ఉదయం 5:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రధాన అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. అక్కడ విజేతలను ప్రకటిస్తారు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం మార్చి 3, 2025న ఉదయం 5:30 IST నుండి ప్రారంభం అవుతుంది. దీనిని స్టార్ మూవీస్, జియో హాట్‌స్టార్‌లలో చూడవచ్చు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక క్లిప్‌ను కూడా షేర్ చేసింది. 

ఎవరు నిర్వహిస్తున్నారు?

ఈ సంవత్సరం ఆస్కార్‌లను హాస్యనటుడు, పాడ్‌కాస్టర్ కోనన్ ఓ బ్రియన్ హోస్ట్ చేస్తారు. ఆయన మొదటిసారిగా హోస్ట్ చేస్తున్న గ్రాండ్ ఈవెంట్‌ ఇదే. ఓ బ్రియన్ గతంలో 2002, 2006లో ఎమ్మీ అవార్డులకు ఆతిథ్యం ఇచ్చారు. ఇకపోతే 97వ అకాడమీ అవార్డులు కాలిఫోర్నియాలోని హాలీవుడ్‌లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో జరుగుతాయి. 

Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment