Devara : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ అరుదైన ఘనతసాధించింది. సెప్టెంబర్ 27 విడుదలైన ఈ చిత్రం ఏపీలోని ఆరు థియేటర్స్ లో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

New Update
devara 100 days

devara 100 days poster

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవ'ర బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. ఈ మూవీ తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది.

సినిమాలో ఎన్టీఆర్ నటన, యాక్షన్ సీన్లు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, 'దేవర' విజయంతో ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ సినిమా తాజాగా సెన్సేషన్ రికార్డును సృష్టించింది. సెప్టెంబర్ 27న విడుదలైన 'దేవర', ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు థియేటర్లలో 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ థియేటర్స్ ను పరిశీలిస్తే..

Also Read : 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా?

తూర్పుగోదావరి : పద్మజ కాంప్లెక్స్
మండపేట : రాజరత్న కాంప్లెక్స్
గుంటూరు : రామకృష్ణ థియేటర్
చిత్తూరు వి.కోట : ద్వారకా పిక్చర్స్ ప్యాలెస్
కల్లూరు : ఎంఎన్ఆర్
రొంపిచెర్ల : ఎంఎం డీలక్స్ థియేటర్

ఈ రోజుల్లో సినిమాలు నెల రోజులపాటు థియేటర్లలో నిలబడటమే కష్టంగా మారింది. కానీ 'దేవర' ఆరు థియేటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడడం విశేషం. ఇటీవల కాలంలో టాలీవుడ్ నుంచి మరే సినిమా ఈ ఘనతను సాదించలేకపోయింది.

Also Read: USA: అమెరికా హౌస్ స్పీకర్‌గా  మళ్ళీ మైక్‌ జాన్సన్‌ ఎన్నిక

మరోవైపు 'దేవర' ఇప్పుడు జపాన్ లో సందడి చేసేందుకు రెడీ అయింది. 2024 మార్చి 28న జపాన్‌లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. జపాన్‌లో ఇటీవల విడుదలైన 'కల్కి 2898 AD' చిత్రాన్ని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ట్విన్, ఇప్పుడు 'దేవర' ను కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-సేల్స్ జనవరి 3న ప్రారంభం కానున్నాయి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు