Court Ott: హీరో నాని నిర్మాతగా ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ కోర్టు డ్రామా 'కోర్ట్: State Vs A Nobody'. అతితక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ. 11 కోట్లతో నిర్మించగా.. విడుదలైన 3 వారాల్లోనే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. కంటెంట్ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
కోర్ట్ ఓటీటీ రిలీజ్..
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. త్వరలోనే 'కోర్ట్' ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. పోక్సో చట్టం అంటే ఏంటి.? దానిని కొందరు ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు..? చట్టం దుర్వినియోగం కారణంగా అమాయకుల జీవితాలు ఎలా బలవుతున్నాయి? అనే మంచి మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
#Court Telugu Movie OTT Release Sets for April 2nd Weekend Premiere On Netflix
— SRS CA TV (@srs_ca_tv) March 31, 2025
Also In Tamil Kannada Malayalam Hindi pic.twitter.com/di6aKLxB5y
డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వం వచించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ అనింగి కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా మంగపతిగా శివాజీ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది.
cinema-news | latest-news | court-movie | court ott release
Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్