మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం(2025) రాబోతుంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం అందరూ రెడీ అవుతన్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలు అప్పుడే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. టాలీవుడ్ నుంచి పలువురు హీరో, హీరోయిన్లు ఫారిన్ లో చిల్ అవుతున్నారు. Also Read: నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా మన అక్కినేని ఫ్యామిలీ నుంచి కొత్త జంట నాగ చైతన్య- శోభిత సైతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈసారి వేడుకలను విదేశాలలో కాకుండా ముంబైలో సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. సాధారణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే సెలబ్రిటీలందరూ విదేశాలకు వెళ్ళిపోతారు. కానీ వీరు మాత్రం ముంబైకి వెళ్లాలని ప్లాన్ చేసుకోవడం గమనార్హం. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ను ముందుగా విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి అని నాగచైతన్య, శోభిత అనుకున్నప్పటికీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ముంబైలోనే సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. Also Read: 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్