/rtv/media/media_files/2025/01/07/0gW3cdbwsU72AaBXrTzy.jpg)
balayya bobby nagavamsi
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించలేదని, ఇందుకు సంబంధించిన అంశంపై ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిని ప్రస్తావించి, ఎన్టీఆర్ నటించిన 'జై లవకుశ' గురించి మాట్లాడకపోవడం హాట్ టాపిక్ అయింది.
అభిమానులు దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 'డాకు మహారాజ్ 'సినిమా బహిష్కరించాలని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ప్రస్తావించారని, కానీ ఎడిటింగ్ సమయంలో ఆ భాగాన్ని కట్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో 'డాకు మహారాజ్' నిర్మాత నాగ వంశీ ఈ వివాదంపై స్పందించారు.
Producer #NagaVamsi opens about the JaiLavaKusa topic. #UnstoppablewithNBKS4 pic.twitter.com/iTMioZ52mi
— Telugu Bit (@Telugubit) January 6, 2025
Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్
ఆఫ్ ద రికార్డ్ తారక్ ప్రస్తావన..
షోలో జూనియర్ ఎన్టీఆర్ పేరు కానీ, 'జై లవకుశ' గురించి కానీ ఎలాంటి ప్రస్తావన రాలేదని స్పష్టంచేశారు. ప్రస్తావన రాకపోతే కట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదని ఆయన వివరించారు. అయితే, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడిన సందర్భంలో బాలయ్య.. ఏదో ఒక పాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని అన్నట్లు నాగ వంశీ పేర్కొన్నారు.
#BoycottDakumaharaj
— Dineshreddy (@Dineshreddy_45) January 6, 2025
What's going on unstoppable show director boby didn't mention Jaya lava kusa movie.its his career best movie #JrNTR best performance in that movie .the reason is bulbul Balayya #Balakrishna #Boycott#UnstoppablewithNBKS4 #nagavamsi #directorbobbykolli
అంతేకాకుండా ఇలాంటి వివాదాలు సినిమా విడుదలకు ముందు చెలరేగడం సరైంది కాదని, ఈ వివాదాలు అభిమానుల మధ్య అనవసరమైన గొడవలకు దారితీస్తున్నాయన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ' నేను తారక్ గారి సినిమాలు నేను చూస్తాను, అలాగే బాలకృష్ణ గారి సినిమాలు కూడా చూస్తాను. రేపు మోక్షజ్ఞ డెబ్యూ చేస్తే, ఆయన సినిమాల కోసం కూడా ఎదురుచూస్తాను. ఈ వివాదాలు మాకు ఎంతో బాధ కలిగిస్తున్నాయి..' అంటూ తెలిపారు.
Also Read: America: భీకర మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!