అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'తండేల్'. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ఎక్కువ భాగం విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో చిత్రీకరించారు.
షూటింగ్ సమయంలో నాగచైతన్య స్థానికులతో మాట్లాడుతూ, తండేల్ సినిమా పూర్తయ్యేలోపు స్వయంగా చేపల పులుసు వండి వారికి వడ్డిస్తానని మాటిచ్చాడు.ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, తన మాటను నిలబెట్టుకుంటూ నాగచైతన్య స్వయంగా కట్టెల పొయ్యిపై రుచికరమైన చేపల పులుసు వండాడు. అందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యేటలో చేపలు పట్టేసాక..మంచి పులుసు ఎట్టేయాలి కదా ♨️
— GA2 Pictures (@GA2Official) January 17, 2025
'Thandel Raju' aka Yuvasamrat @chay_akkineni cooks a lip-smacking 'Chepala Pulusu' for the locals during the shoot of #Thandel 😋
▶️ https://t.co/uHTpVTHjNK#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7th 💥… pic.twitter.com/5HiV1GpDDl
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
ఈ వీడియోలో.. ఒక స్థానిక వ్యక్తి మాట్లాడుతూ,' అన్నా ఇంతకుముందు నాగచైతన్యను కలిసిన కదా.. అప్పుడు మా అంత బాగా ఆయన చేత్తోనే చేపల పులుసు వండుతనని మాటిచ్చినడు. ఆ మాటెంతవరకు కరెక్ట్ అవుతుందో చూడటానికి మేం వెళ్లాం. అచ్చం మాలాగే కట్టెల పొయ్యిపై రుచికరమైన చేపల పులుసు వండాడంటూ..' వీడియో సాగింది.
చైతన్య వండిన చేపల పులుసును స్థానికులు ఆస్వాదిస్తూ, సూపర్‌గా ఉందని ప్రశంసించారు. "యేట్లో చేపలు పట్టాక, మంచి పులుసు వండాలి కదా," అంటూ నాగచైతన్య చేపల పులుసు వండిన మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.