Nag Ashwin: 'కల్కి' ఆ హీరో చేసుంటే 2000 కోట్లు కలెక్ట్ చేసేది: నాగ్ అశ్విన్

నాగ్ అశ్విన్ తాజా చిట్ చాట్‌లో 'కల్కి' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సలార్' డైనోసార్ అయితే, 'కల్కి' డ్రాగన్ అవుతుందని అన్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబు 'లార్డ్ కృష్ణ' పాత్రలో కనిపిస్తే, ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసేదని తెలిపారు.

New Update
nag ashwin about kalki

nag ashwin about kalki

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ 'కల్కి 2898AD' ఈ ఏడాది జూన్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషల ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 

అలాగే ఫుల్ రన్ లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాప్ హిట్‌గా నిలిచింది. నాగ్ అశ్విన్ తాజా చిట్ చాట్‌లో ఈ సినిమాపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 'సలార్' డైనోసార్ అయితే, 'కల్కి' డ్రాగన్ అవుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

 అలాగే, బాక్సాఫీస్ వద్ద మరింత ప్రభావం చూపేందుకు సలార్ 2 మరియు స్పిరిట్ వంటి ప్రాజెక్టులు కూడా సిద్ధంగా ఉన్నాయని, ఈ చిత్రాలు రూ.1500 కోట్ల హ్యాట్రిక్ వసూళ్లను సాధించే అవకాశముందని అన్నారు. ఇదే సందర్భంలో, 'కల్కి 2898 ఎ.డీ' సీక్వెల్ త్వరలోనే రాబోతుందని తెలిపారు.

 

ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌ అయ్యేది..

మొదటి భాగం షూటింగ్ సమయంలో ఒక భాగం తీయాలా, రెండు భాగాలుగా చేయాలా అనే సందిగ్ధంలో ఉండగా, చీటీలు వేసి రెండు భాగాలు అనేదాన్ని ఫిక్స్ చేశామని అన్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబు 'లార్డ్ కృష్ణ' పాత్రలో పూర్తి స్థాయిలో కనిపిస్తే, ఈ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసి, ఇదివరకెన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచేదని పేర్కొన్నారు. 

Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

అంతేకాకుండా ఒకవేళ 'కల్కి' సీక్వెల్ లో ఫుల్ లెంగ్త్‌ గాడ్‌ రోల్‌ ఊహించుకుంటే.. పక్కా మహేశ్ బాబును పెట్టేస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు