/rtv/media/media_files/2025/01/19/ksRRofbsdt2vSZktN7Hu.jpg)
actress mrunal thakur
'సీతారామం' తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన మృణాల్ ఠాకూర్.. ఫస్ట్ మూవీతోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'హాయ్ నాన్న'తో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దగుమ్మకు 'ఫ్యామిలీ స్టార్' రూపంలో హ్యాట్రిక్ మిస్సయ్యింది. మళ్ళీ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'కల్కి'లో జస్ట్ క్యామియోతో సరిపెట్టేసింది. 'కల్కి' తర్వాత మృణాల్ తెలుగు ఆడియన్స్ కు దూరంగా ఉంటోంది.
ఆఫర్లు రావట్లేదో లేదో వద్దనుకుంటుందో లేక కథ నచ్చట్లేదో కానీ టాలీవుడ్‌లో ఆమె కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ రావడానికి ఏడాది సమయం పట్టింది. ఇటీవల, మృణాల్ అడివి శేష్ 'డెకాయిట్' సినిమాకు కమిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలుండగా, వాటిలో నాలుగు హిందీ చిత్రాలు కావడం గమనార్హం.
Also Read: మనోజ్‌పై మోహన్ బాబు విక్టరీ.. ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశాలు!
అందులో, వరుణ్ ధావన్‌తో 'హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై', అజయ్ దేవగన్ ప్రాజెక్ట్ 'సన్ ఆఫ్ సర్దార్ 2', 'పూజా మేరీ జాన్', సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'తుమ్ హీ హో' లాంటి బడా ప్రాజెక్ట్స్‌లో ఛాన్సులు అందుకుంది. అయితే, మృణాల్ చేతిలో ప్రస్తుతం తెలుగులో 'డెకాయిట్' సినిమా మాత్రమే ఉంది. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషలో బైలింగ్వల్‌గా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో మొదటగా శృతి హాసన్‌ను తీసుకున్నా, ఆ స్థానంలో ఇప్పుడు మృణాల్ ను రీప్లేస్ చేశారు. ఈ లైనప్ చూస్తుంటే మృణాల్ టాలీవుడ్‌కు మెల్లగా దూరమవుతోందని అర్థం అవుతోంది. అదే సమయంలో బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెంచుతూ, అక్కడ తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. దీన్ని బట్టి రానున్న రోజుల్లో మృణాల్.. టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయినట్లే అని చెప్పొచ్చు.