/rtv/media/media_files/2025/01/30/o67mXez0IVXozdug5oLt.jpg)
monalisa movie director arrest
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన సనోజ్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ యువతిని లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ నెలకొంది.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఎలాంటి దాడి జరగలేదని..
తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఆ యువతి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సనోజ్ అమాయకుడు అని కావాలనే కొందరు ఇరికిస్తున్నారని తెలిపింది. సనోజ్‌తో ఉండటం, ఇద్దరి మధ్య గొడవలు రావడం నిజమే. కానీ తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. కావాలనే కొందరు సనోజ్‌ను ఇరికిస్తున్నారని తెలిపింది.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
ఇదిలా ఉండగా మోనాలిసా మహాకుంభమేళలో పూసలు, దండలు అమ్ముకుంటూ ఓవర్ నైట్‌లో ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమె నీలికళ్లు, అమాయకపు చూపులకు ఫిదా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఫిదా అయ్యాడు. తాను తీసే ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్ తర్వాత మోనాలిసా జాతకం ఒక్కసారిగా మారిపోయింది.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఈవెంట్లకు ఆమెను గెస్ట్‌గా వెళ్తుంది. ఇటీవల కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌తో పాటు నేపాల్‌లో ఇటీవల జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కూడా వెళ్లింది. ఇలా వరుస ఈవెంట్లకు కూడా ఆమె హాజరు అవుతుంది. సోషల్ మీడియా మోనాలిసాను హీరోయిన్‌గా మార్చేసింది.