/rtv/media/media_files/2026/05/07/drishyam-3-2026-05-07-12-52-55.jpg)
Drishyam 3
Drishyam 3: మలయాళ స్టార్ మోహన్ లాల్ Mohanlal నటిస్తున్న దృశ్యం 3 Drishyam 3 సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A 13+ సర్టిఫికెట్ ఇచ్చింది.
#Drishyam3 censored with U/A 13+ certificate.
— Mohanlal (@Mohanlal) May 6, 2026
In Cinemas Worldwide from May 21, 2026@jeethu4ever@antonypbvr@KumarMangat@jayantilalgada@AbhishekPathakk#MeenaSagar@aashirvadcine@PanoramaMovies@PenMovies@ram_rampagepix#RavindraAuti@Rajeshmenon1969@Abh1navMehrotra… pic.twitter.com/czw9TU1YTN
Also Read : "తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్" జన నాయకుడు టైటిల్ కార్డ్ వీడియో లీక్..!
Drishyam 3 Censor Complete With UA 13+ Certificate
ఈ విషయాన్ని మోహన్‌లాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మే 21న థియేటర్లలో విడుదల కానుంది.
U/A 13+ సర్టిఫికెట్ రావడంతో 13 ఏళ్లు పైబడిన వారు తల్లిదండ్రుల అనుమతితో ఈ సినిమాను చూడొచ్చు. ఇక త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల కావచ్చని సమాచారం.
మొదట ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రిలీజ్‌ను మే 21కి మార్చారు.
‘దృశ్యం 3’లో జార్జ్ కుట్టి కథ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగనుంది. గత భాగాల్లో జరిగిన సంఘటనల తర్వాత దాదాపు నాలుగున్నర సంవత్సరాల తరువాత కథ కొనసాగుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాకు Jeethu Joseph దర్శకత్వం వహిస్తున్నారు. Aashirvad Cinemas బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ‘దృశ్యం’ సిరీస్ భారతీయ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మూడో భాగం కూడా అదే స్థాయిలో ఉత్కంఠభరితంగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’పై భారీ బజ్.. బర్త్‌డేకు స్పెషల్ వీడియో?
Follow Us