Actress Hema: టాలీవుడ్ నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో తనపై అవాస్తవాలు ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానెల్స్ కు, పలువురు నటులకు లీగల్ నోటీసులు పంపింది. కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొంది. అంతేకాదు తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది హేమ. మా ఎన్నికల సమయంలోనూ హేమ.. కళ్యాణి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నోటీసులకు సంబంధించి ఇప్పటికే తమన్నా.. హేమ లీగల్ టీమ్ తో చర్యలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు
2023లో కూడా
అయితే 2023లో కూడా హేమ పలు యూట్యూబ్ ఛానెళ్ల పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన బర్త్ డే పార్టీలో భర్తతో కలిసి ఉన్న ఫొటోలకు ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టి ఇష్టానుసారంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయింది. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదిలా ఉంటే గతేడాది హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన హేమ.. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆమెను మా అసోసియేషన్ నుంచి తొలగించడం కూడా జరిగింది. కాగా, ఆ తర్వాత నిర్వహించిన రక్త పరీక్షల్లో నెగిటివ్ అని తేలడంతో 'మా' హేమ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
telugu-news | latest-news | actress-hema | karate-kalyani | tamanna-simhadri | cinema-news
ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!