Manoj Manchu: 'నా సూర్యుడివి నా చంద్రుడివి'.. నాన్న బర్త్ డే రోజు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ !

ఈరోజు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా తండ్రికి విషెష్ తెలియజేస్తూ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు మనోజ్. ఆయనతో దిగిన ఫొటోలను, సినిమాల్లోని సన్నివేశాలను 'నా సూర్యుడివి నా చంద్రుడివి' పాటతో ఎడిట్ చేశారు. బర్త్ డే సమయంలో నీ పక్కన లేనందున బాధగా ఉంది నాన్న అంటూ ట్వీట్ చేశారు.

New Update
manoj birthday wishes to mohan babu

manoj birthday wishes to mohan babu

Manoj Manchu:  మంచు ఫ్యామిలీ గత కొద్దిరోజులుగా వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  మంచు మనోజ్, మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకునే వరకు వెళ్లారు. అయితే ఓ వైపు తండ్రితో విభేదాలు ఉన్నప్పటికీ.. ఆయనపై తన ప్రేమను తెలియజేశారు మంచు మనోజ్. 
తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మనోజ్ ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశారు. 

Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ 

మోహన్ బాబుతో కలిసి దిగిన ఫొటోలను, సినిమాల్లోని సన్నివేశాలను 'నా సూర్యుడివి నా చంద్రుడివి' పాటతో ఎడిట్ చేసి వీడియోను పంచుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.  బర్త్ డే రోజున  మీ పక్కన లేనందున బాధగా ఉంది.  నీ చుట్టూ ఉండటానికి ఇంక ఎక్కువ కాలం  వేచి ఉండలేను నాన్న.. ఐ లవ్ యూ అంటూ తండ్రికి బర్త్ డే విషెష్ తెలియజేశారు మనోజ్. 

Also Read: SSMB 29 Update: ‘SSMB 29’ నుంచి మహేశ్, ప్రియాంక కిర్రాక్ ఫొటోలు.. వాలీబాల్ ఆడుతున్న జక్కన్న!

ఇదిలా ఉంటే  మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా  'కన్నప్ప'లో  ఆయన నటించిన 'మహాదేవ శాస్త్రి' పాత్ర ఇంట్రో సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహాదేవ శాస్త్రి గర్జన ప్రతిధ్వనిస్తోంది.. మహాదేవ శాస్త్రి పరిచయ గీతంలో కోపం, విశ్వాసం ఏకమయ్యాయి. శైవ తుఫానుకు సిద్ధంగా ఉండండి! అంటూ మోహన్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు. 

Also Read: Jaya Bachchan: బాలీవుడ్ లో టాయిలెట్ వివాదం.. హీరో పై సీనియర్ నటుడి భార్య విమర్శలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Delhi CM: నా శరీరాన్ని దేశానికి అంకితం చేస్తున్నా.. ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన!

అక్షయ్ కుమార్ 'కేసరి చాప్టర్ 2' ప్రీమియర్ షో చూసిన తర్వాత ఢిల్లీ CM రేఖగుప్తా భావోద్వేగానికి గురయ్యారు. తన శరీరం, మనసు, జీవితం మొత్తాన్ని దేశానికి అంకితం చేస్తున్నానని అన్నారు. జలియన్‌ వాలాబాగ్‌ విషాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.

New Update
delhi cm rekha Gupta on kesari chapter 2

delhi cm rekha Gupta on kesari chapter 2

Delhi CM:  కరణ్ ఎస్ త్యాగి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్' ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించగా..  ఢిల్లీ సీఎం రేఖాగుప్తా  హాజరయ్యారు. సినిమా చూసిన తర్వాత సీఎం రేఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మాతృభూమి కోసం తన  జీవితాన్ని, శరీరాన్ని, మనస్సును అంకితం చేయాలనుకుంటున్నాను అని ఎమోషనల్ అయ్యారు. 

ఢిల్లీ సీఎం రేఖ భావోద్వేగం.. 

రేఖ గుప్తా ఇంకా మాట్లాడుతూ.. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగం చేసిన లక్షలాది మంది గురించి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఖచ్చితంగా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మన కోసం జీవితాలు త్యాగం చేసిన ఎంతో మంది పేర్లు కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం మన మాతృభూమి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మాతృభూమి కోసం నేను నా జీవితాన్ని, శరీరాన్ని, మనస్సును అంకితం చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది అని అన్నారు.  రేఖా గుప్తాతో పాటు, హర్దీప్ పూరి, మంజిండియర్ సింగ్ సిర్సా, బన్సూరి స్వరాజ్,  అనురాగ్ ఠాకూర్ వంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈ చిత్రాన్ని వీక్షించారు.

Advertisment
Advertisment
Advertisment