/rtv/media/media_files/2025/01/27/4mRimAL448S5UlQCvcsq.jpg)
mahesh babu ssmb 29 update
మహేశ్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం '#SSMB29'. అందరి కళ్లు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిస్తున్నాడు.
ఇప్పటికైతే ఈ మూవీలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కొన్ని అప్డేట్లు బయటకు వచ్చాయి. అంతకు మించి మరే ఇతర అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇటీవలే రాజమౌళి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. మహేశ్ బాబు పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా ఓ వీడియోను షేర్ చేశారు.
జక్కన్న జాగ్రత్తలు
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
దీంతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయినట్లు నెట్టింట చర్చ నడిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం దాదాపు రూ.1000 కోట్లతో తెరకెక్కనుందని సమాచారం. అందువల్ల ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క సమాచారాన్ని బయటకు లీక్ కాకుండా చూస్తున్నాడు జక్కన్న. ఇందులో భాగంగానే తమ టీమ్ కు గట్టి వార్నింగే ఇచ్చాడట.
భారీగా మూల్యం చెల్లంచాల్సిందే
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
ఈ సినిమాకి సంబంధించిన నటీ నటులు, ఇతర టెక్నీషియన్ల సహా చిత్ర యూనిట్ అంతటికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. వారితో నాన్ డిస్ క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు కొన్ని వార్తలు నెట్టింట జోరుగా సాగాయి. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విషయాన్ని లీక్ చేయడానికి వీల్లేదు అన్నమాట. ఒకవేళ ఎవరైనా లీక్ చేసినట్లు రుజువు అయితే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చూడండి: UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే
అంతేకాకుండా ఎవరైతే సెట్ లో అడుగుపెడతారో వారెవరూ ఫోన్లు వాడకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు హీరోకి కూడా ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి జక్కన్న ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటాడో.