Mahesh Babu : సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన మహేష్.. వీడియో లీక్.!

మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్లంతా ఇది 'SSMB29' షూటింగ్ అని అనుకున్నారు. కానీ అది ఓ యాడ్ షూట్ అని తెలిసి షాక్ అయ్యారు. ఈ షూట్‌లో మహేశ్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పాల్గొంది.

New Update
mahesh babu new ad shoot

mahesh babu new look

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తదుపరి సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల సైలెంట్ గా జరిగాయి. తన సినిమాలను ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రారంభించే రాజమౌళి, ఈ సినిమా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 

మహేశ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేశ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. తన లుక్కును పూర్తిగా మార్చుకున్నాడు. ఇదిలా ఉంటే ఉన్నట్టుండి మహేష్ షూటింగ్ లో పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్లంతా ఇది 'SSMB29' షూటింగ్ అని అనుకున్నారు. 

Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

కానీ అది ఓ యాడ్ షూట్ అని తెలిసి షాక్ అయ్యారు. మ్యాటర్ ఏంటంటే.. బుధవారం మహేశ్ బాబు ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అది కూడా ఓ యాడ్ షూట్‌. ట్రూ జోన్ సోలార్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్, ఆ యాడ్ షూట్‌లో పాల్గొనడం జరిగింది. ఈ షూట్‌లో మహేశ్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పాల్గొంది. షూట్ లో భాగంగా మహేష్ సెట్స్ లో కూర్చున్న ఫొటోలతో పాటూ ఓ వీడియో కూడా బయటికొచ్చింది. 

ఇందులో మహేష్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి యాడ్స్ షూట్స్ కాకుండా వీలైనంత త్వరగా 'SSMB29' షూట్ లో జాయిన్ అయితే బాగుంటుందని ఈ సందర్భంగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 'SSMB29' విషయానికొస్తే.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు.

Also Read : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack పహల్గామ్ లో బిగ్ బాస్ నటి కాజల్.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే!

బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉండడం ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది.

New Update
rj kajal in  Pahalgam attack

rj kajal in Pahalgam attack

Rj Kajal: కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని కలచివేస్తోంది. మినీ స్విజ్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను దారుణంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 29 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు. 

పహల్గామ్ లో కాజల్ 

అయితే బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది. నాకు కోసం ఆలోచించిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది.  ''పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నన్ను ఎంతో బాధించింది.  ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు, అధికారులు ఎంతో కృషిచేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ ప్రశాంతంగా, సేఫ్ గా ఉంది'' అంటూ వీడియోను షేర్ చేసింది. 

 latest-news | telugu-news | cinema-news

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

Advertisment
Advertisment
Advertisment