/rtv/media/media_files/2025/02/28/CXDditUGqq1mXcWQJp3g.jpg)
Mahesh Babu SSMB 29
SSMB 29 Viral Video: సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, ముఖ్యంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత జక్కన తెరకెక్కించబోతున్న పెద్ద బడ్జెట్ ఇదే. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. అయితే కొంతకాలంగా ఈ చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జోరుగా జరుగుతోంది.
Also Read: Ravi Prakash: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా, మహేష్ తన లుక్ అండ్ మేకోవర్‌ను పూర్తిగా మార్చేశాడు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించనున్నారు.
Also Read: AP: ఓబులవారి పల్లె పీఎస్ ముగిసిన పోసాని విచారణ
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ కాబట్టి మహేష్ బాబు ఇందులో ఒక కొత్త, డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా పై అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇంతకీ కథ ఏంటీ, అసలు మహేష్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు జక్కన్న అనే ప్రశ్నలు అభిమానులలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ సినిమా గురించి ఒకే ఒక్క అప్ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్నారు ఫాన్స్. కానీ జక్కన్న ఎలాంటి అప్ డేట్లు ఇవ్వడం లేదు, సినిమాకి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న.
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
సింహం సిద్ధం అవుతోంది..!
అయితే మహేష్ బాబు ప్రస్తుతంలో ఎక్కడా కనిపించడం లేదు, అతని లుక్ కూడా సీరియస్‌గా హైడ్ చేస్తున్నారు. అయితే, ఇటీవల మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మహేష్ బాబు జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆయన పొడవైన జుట్టులో అద్దం ముందు నుంచొని సింహంలా కనిపిస్తున్నారు, దాంతో మహేష్ అభిమానులు “సింహం సిద్ధం అవుతోంది” అని ఆ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజమౌళి మహేష్ ను ఈ మూవీ కోసం బల్క్ అవ్వమని సూచించారట. ఈ మూవీలో దట్టమైన జుట్టుతో, కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడు మహేష్. ఈ వీడియోని సోషల్ మీడియాలో చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు.
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్