/rtv/media/media_files/2025/03/19/s9KLEqQvKvI594A3IUde.jpg)
mahesh babu athadu movie
Athadu: దాదాపు 20 ఏళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు 'అతడు' మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది. టెలివిజన్ లో 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా ఘనతను సాధించింది. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టీవీలో ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తొలి సినిమా ఇదే. 2005 లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్, త్రిష జంటగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ మాయచేశాయి. "నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు. నిజం చెప్పకపోవటం అబద్దం.. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం'' ఇలాంటి అనేక డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Also Read : భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!
Mahesh Babu's movie created a world record! 🔥🔥🔥🔥
— Mahesh Manu (@BManoha16490298) March 19, 2025
The film Athadu has been telecasted 1,500 times on TV.#Athadu4K #MaheshBabu𓃵 #SSMB29 pic.twitter.com/fGpfCAatAx
Also Read: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్
SSMB29 తో బిజీ
ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని.. చిత్రీకరణ ప్రారంభించినట్లు సమాచారం. ఇటీవలే సినిమాలో మహేష్ బాబు లుక్ కి సంబంధించిన ఓ ఫొటో బయటకి రాగా.. క్షణాల్లో వైరల్ అయ్యింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈసినిమా 2027 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Mad Square Song: మళ్లీ వచ్చార్రోయ్.. ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి హోరెత్తించే సాంగ్
Also Read : IPL 2025: ఐపీఎల్ ప్రియులకు బిగ్ షాక్.. ఆ మ్యాచ్ రీషెడ్యూల్