Monalisa: మోనాలిసా దెబ్బకు జాన్వీ ఔట్.. RC16 కోసం బుచ్చిబాబు బిగ్ ప్లాన్!

కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RC16లో మోనాలిసాను తీసుకుంటున్నట్లు టాక్. దీంతో మూవీలో మోనాలిసా పాత్ర ఏమై ఉంటుందా? అని ఆసక్తికరంగా మారింది.

New Update
monalisa

monalisa

Monalisa: మహాకుంభమేళాలో నీలి రంగు కళ్ళతో ఓవర్‌నైట్ సెన్షేషన్‌ మారిన  మోనాలిసా ఇప్పటికే బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేయగా.. ఇప్పుడు తెలుగులోనూ ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు  నెట్టింట ప్రచారం జోరుగా సాగుతోంది. బుచ్చి బాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న RC16 సినిమాలో మోనాలిసాను తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు

అయితే ఈ మూవీలో ఇప్పటికే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా.. మోనాలిసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది. లేదా జాన్వీతో పాటు మోనాలిసా కూడా సెకండ్ ఫీమేల్ లీడ్ గా పెట్టబోతున్నారా? అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమే అయితే ఓవర్ నైట్ లో సెన్సేషన్ గా మారిన ఈ బ్రౌన్ బ్యూటీ.. జాన్వీని డామినేట్ చేస్తుందేమో? అని నెటిజన్లు అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మోనాలిసా అందానికి ఫిదా అవుతుండడంతో.. ఈ సినిమాలో  ఆమెకు మంచి రోల్ పడితే చరణ్ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్. 

Also Read: Mahakumbh Mela 2025: పాపం.. మోనాలిసాకు టార్చర్.. వీడియోలు వైరల్!

ఇబ్బంది పెడుతున్న జనం 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మోనాలిసా వీడియోలు, ఫోటోలే దర్శనమిస్తున్నాయి. దీంతో కుంభమేళాకు వచ్చిన వారంతా ఆమె తో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఇది ఆమెను,  కుటుంబ సభ్యులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దీని వల్ల వారి వ్యాపారం కూడా దెబ్బతిన్నట్లు ఆమె తండ్రి తెలిపారు.  మహా కుంభమేళాలో పూసలు దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఈ మోనాలిసా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన అమ్మాయి. ఆమె కుటుంబం అంతా పూసల దండాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది. కొంతకాలం చదువుకున్న మోనాలిసా ఆర్ధిక ఇబ్బందులతో చదువుకు దూరమైనట్లు తెలిపింది. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన నెక్స్ట్ సినిమాలో మొనాలిసాకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు