రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. చిత్ర యూనిట్ ప్రొమోషన్లలో బిజీగా ఉంది. కాగా ఈ ప్రమోషన్స్ లో SJ సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి వంటి ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో అంజలి రెగ్యులర్ గా పాల్గొంటుంది. కానీ కియారా అద్వానీ మాత్రం ఒక్క టీజర్ లాంచ్ ఈవెంట్లో తప్ప ఇప్పటివరకు ఎక్కడా ప్రమోషన్స్ లో కనపడలేదు. ఈరోజు ముంబైలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్‌కు కూడా కియారా రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంత పెద్ద సినిమాకు కియారా ఎందుకు ప్రమోషన్స్ కి రావట్లేదు అని అంతా చర్చించుకుంటున్నారు. Also Read : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్ కియారాని ప్రమోషన్స్ కి తీసుకురమ్మని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో మూవీ యూనిట్ ని అడుగుతున్నారు. అయితే కియారాకు స్వల్ప ఆరోగ్య సమస్యలున్నట్లు, అందుకే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ విషయమై ఆమె మేనేజర్ వివరణ ఇచ్చారు. కియారా ఆస్పత్రిలో చేరలేదు. పని ఒత్తిడితో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అందుకే ఆమె కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేకపోయినట్లు తెలియజేశారు. అంతేకాదు రాజమండ్రిలో జరగనున్న 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా కియారా రావడం లేదని సమాచారం. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కొంత నిరాశకు లోనవుతున్నారు. Also Read : 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా?