'గేమ్ ఛేంజర్' కు బిగ్ షాక్.. రిలీజ్ కు ముందే బ్యాన్ చేయాలంటూ ఆందోళన!

కర్ణాటకలో 'గేమ్ ఛేంజర్' పోస్టర్లపై కొందరు నల్లరంగు స్ప్రే చేయడం చర్చనీయాంశమైంది. పోస్టర్‌లో టైటిల్ కన్నడలో లేకపోవడం వల్ల స్థానిక భాషాభిమానులు ఆగ్రహానికి గురయ్యారని, ఈ నేపథ్యంలో 'బ్యాన్ గేమ్ ఛేంజర్ ఇన్ కర్ణాటక' అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

New Update
game changer ban in karnataka

ram charan game changer movie

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, గురువారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా మీద ఉన్న అంచనాలు ఈ ట్రైలర్ విడుదలతో మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే కర్ణాటకలో 'గేమ్ ఛేంజర్' సినిమా పోస్టర్లపై కొందరు నల్లరంగు స్ప్రే చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Also Read : అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?

 సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నా, మేకర్స్ నుంచి అప్‌డేట్ లేకపోవడం, అలాగే ప్రమోషన్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా రాకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొందరైతే ఈ నిరసనకు మరొక కారణం ఉందని అంటున్నారు. 

బ్యాన్ గేమ్ ఛేంజర్..

పోస్టర్‌లో టైటిల్ కన్నడలో లేకపోవడం వల్ల స్థానిక భాషాభిమానులు ఆగ్రహానికి గురయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'బ్యాన్ గేమ్ ఛేంజర్ ఇన్ కర్ణాటక' అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

కారణం అదేనా?

కర్ణాటకలో భాషాభిమానానికి అధిక ప్రాధాన్యత ఉండటంతో, ఇటీవల కన్నడలో బోర్డులు లేకపోవడం వల్ల కొన్ని షాపింగ్ మాల్స్, హోటల్స్‌పై దాడులు జరిగాయి. ఇదే తరహాలో, గేమ్ ఛేంజర్ టైటిల్ ఇంగ్లీష్‌లోనే ఉండటాన్ని నిరసిస్తూ, టైటిల్‌ను కనీసం కన్నడలో ముద్రించాల్సిందని భావిస్తున్నారు.

Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా?

మేకర్స్ మాత్రం కర్ణాటకలోనూ ఇంగ్లీష్ అక్షరాలతో పోస్టర్లు వేశారు. ఈ కోపంతోనే అక్కడి వాళ్ళు 'గేమ్ ఛేంజర్' ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు