2025 Movies: కన్నప్ప నుంచి రాజాసాబ్.. 2025లో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలివే?

తెలుగు చిత్ర పరిశ్రమ విభిన్న కథాంశాలతో  ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు  కొత్తదనాన్ని అందిస్తోంది. ఈ ఏడాది 'కన్నప్ప' నుంచి రాజా సాబ్ వరకు ఈ ఏడాది సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టార్ హీరోల సినిమాలేంటో ఇక్కడ తెలుసుకోండి.

New Update
2025 most awaited films

2025 most awaited films

2025 Movies: తెలుగు చిత్ర పరిశ్రమ విభిన్న కథాంశాలతో  ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు  కొత్తదనాన్ని అందిస్తోంది. యాక్షన్, థ్రిల్లర్, ఫాంటసీ, హారర్, రొమాంటిక్ కామెడీలు, మాస్ ఎంటర్‌టైనర్‌లు,  కామెడీ డ్రామా ఇలా రకరకాల జోనర్ సినిమాలతో ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఈ ఏడాది కన్నప్ప నుంచి రాజా సాబ్ వరకు సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టార్ హీరోల చిత్రాలేంటో ఇక్కడ చూద్దాం.. 

2025 ఫిల్మ్స్  

ఘాటి

అనుష్క శెట్టి- క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్  'ఘాటి' కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత స్వీటీ నుంచి రాబోతున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 18న తెరపైకి రానుంది. 

కన్నప్ప

మంచు విష్ణు హీరోగా ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ‘కన్నప్ప’. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో  మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హిట్ 3

‘HIT’ ఫ్రాంచైజీ  'హిట్ 3' ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ   మే 1, 2025న విడుదల కానుంది.  శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్  అర్జున్ సర్కార్‌ పాత్రలో నటిస్తున్నాడు.

విశ్వంభర

మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ చిత్రం 'విశ్వంభర'. ఈ చిత్రం మే 9, 2025న థియేటర్లలో విడుదల కానుంది.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. 

కింగ్‌డమ్

విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్‌డమ్' మే 30, 2025న థియేటర్లలోకి రానుంది. లైగర్, ఫ్యామిలీ స్టార్ వరుస డిజాస్టర్స్ తర్వాత రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.

రాజాసాబ్

హారర్-కామెడీ నేపథ్యంలో రాబోతున్న ప్రభాస్ 'రాజాసాబ్' ఏప్రిల్ 10, 2025న  విడుదల కానుంది. ఈ చిత్రం విధిని ధిక్కరించి, తమ ప్రేమను రక్షించుకోవడానికి చీకటి శక్తులను అధిగమించాల్సిన జంట కథగా సాగనుంది. 

Also Read: Hibiscus: ఇది పువ్వు మాత్రమే కాదు.. మందారం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Khushbu: స్లిమ్‌గా మారేందుకు ఇంజెక్షన్.. ఖుష్బూ న్యూ లుక్‌పై నెట్టింట రచ్చ రచ్చ!

నటి ఖుష్బూ నెట్టింట తన న్యూ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటోల్లో ఆమె సన్నగా కనిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇంజెక్షన్లతో సన్నబడ్డారు అని ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఖుష్బూ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

New Update
actress Khushbu

actress Khushbu

Khushbu:  సీనియర్ నటి, రాజకీయనాయకురాలు ఖుష్భు సుందర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఖుష్బూ మోడ్రన్ దుస్తులలో అద్భుతమైన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో సన్నగా, స్టైలిష్ కనిపిస్తూ బ్యాక్ టూ ది ఫ్యూచర్ అని క్యాప్షన్ పెట్టారు. అయితే  ఆమె రూపాంతరం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కొందరు ఆమె సన్నబడడాన్ని ప్రసంశించగా.. మరికొందరు ఆమె బరువు తగ్గడానికి  ఇంజెక్షన్లు తీసుకున్నారు అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇంజెక్షన్ల మ్యాజిక్  వల్లే ఇలా మారిపోయారు. వాటి గురించి ఫాలోవర్స్‌కు కూడా చెప్పండి’ అంటూ కామెంట్లు పెట్టారు. 

ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్ 

కాగా, దీనిపై ఖుష్బూ స్పందింస్తూ ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు అసలు ఎలాంటి మనుషులు? సోషల్ మీడియాలో మీరెప్పుడూ మీ మొహాలు చూపించరు! ఎందుకంటే అంత అసహ్యంగా ఉంటారు కావున మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తుంది అని రీట్వీట్ చేశారు. 

latest-news | telugu-news | cinema-news | senior-actress-khushbu 

Advertisment
Advertisment
Advertisment