Kannappa: డార్లింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. కన్నప్పలో నుంచి ప్రభాస్ పోస్టర్ గ్లిమ్ప్స్ !

'కన్నప్ప' నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ నుంచి ప్రభాస్ లుక్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. అలాగే ఫస్ట్ లుక్ కి సంబంధించిన పూర్తి వీడియో ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

New Update

Also Read: వాంతికి రావడంతో బస్సులో నుంచి తల బయటకు.. కట్ చేస్తే రోడ్డుపై తల, చేయి!

కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్.. 

ఈ క్రమంలో తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ కళ్ళు, నుదిటి భాగం మాత్రమే కనిపిస్తుంది.  నుదిటిపై విభూతి నామాలు,  చేతిలో త్రిశూలంతో పవర్ ఫుల్ గా కనిపించారు.  అయితే ప్రభాస్ పూర్తి లుక్ పోస్టర్ ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. 

గతంలో ప్రభాస్ లుక్ లీక్

ఇది ఇలా ఉంటే.. గతంలో కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ లీక్ అంటూ ఓ ఫొటో నెట్టింట తెగ వైరలైంది.  దీనిపై స్పందించిన మంచు విష్ణు ఫొటో లీక్ చేసినవారిని పట్టిస్తే భారీగా రివార్డు అందిస్తానని బంపరాఫర్ ప్రకటించారు. సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా.. ఫొటో లీక్ చేసిన నిందితుడిని పట్టుకున్నారు. అతడితో క్షమాపణలు కూడా చెప్పించారు. 

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

ఇటీవలే కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పోస్టర్లు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్షయ్, కాజల్ శివపార్వతుల పాత్రలో కనిపించనున్నారు. మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న ఈ  భారీ బడ్జెట్ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్

Advertisment
Advertisment
Advertisment