Kannappa: ప్రళయకాల రుద్రుడు.. కన్నప్ప నుంచి రెబల్ స్టార్ లుక్ ఎలా ఉందో చూడండి!

మంచు విష్ణు అవైటెడ్ ఫిల్మ్ 'కన్నప్ప' నుంచి ప్రభాస్ లుక్ విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ 'రుద్ర' కనిపించనున్నట్లు తెలిపారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ షేర్ చేశారు.

New Update

Kannappa movie:  మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ అంచనాలతో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'కన్నప్ప'. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సిద్దమవుతున్న ఈ స్టోరీలో పలువురు  బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. 

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

ప్రభాస్ లుక్ 

దీంతో సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ లుక్ రిలీజ్ చేయగా.. నెట్టింట వైరల్ గా మారింది. కన్నప్పలో ప్రభాస్  'రుద్ర' పాత్రలో  కనిపించనున్నట్లు తెలిపారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ షేర్ చేశారు.  

ఇది ఇలా ఉంటే .. ఇటీవలే కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పోస్టర్లు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్షయ్, కాజల్ శివపార్వతుల పాత్రలో కనిపించనున్నారు. మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న ఈ  భారీ బడ్జెట్ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment