kannappa: ఇట్స్ అఫీషియల్.. ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?

కన్నప్ప కొత్త రిలీజ్ డేట్‌ను మంచు విష్ణు అనౌన్స్ చేశాడు. సినిమాను జూన్ 27వ తేదీన విడుదల చేస్తామని మంచు విష్ణు నేడు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌తో ఉన్న ఈ చిత్రం పోస్టర్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు.

New Update
kannappa new release date

kannappa new release date

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మంచు విష్ణు శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రను పోషించాడు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

కొత్త రిలీజ్ డేట్ ఇదే

ఇటీవల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ.. ఈ చిత్రం రిలీజ్‌ను వాయిదా వేశారు. తాజాగా మంచు విష్ణు కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు. కన్నప్ప చిత్రాన్ని జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

ఈ మేరకు మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కలిసి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కొత్త రిలీజ్ డేట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అందుకు సంబంధించిన ఫొటోలను మంచు విష్ణు తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేశాడు. అందులో తన ఫేవరెట్ హీరోల్లో యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఇవాళ ఆయన్ను కలిశాను. కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఆయన లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రమేశ్ గొరిజాల పెయిటింగ్‍ను ఆయనకు బహుమతిగా అందజేశాను అంటూ అందులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

(kannappa | manchu-vishnu | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Priyanka Jain: అబ్బా! బ్లూ శారీలో ప్రియాంక భలే ఉందిగా.. ఫొటోలు చూశారా

బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర నటి ప్రియాంక జైన్ నీలిరంగు చీరలో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ ఫోజులతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. Short News | Latest News In Telugu | సినిమా

New Update
Advertisment
Advertisment
Advertisment