Junior NTR : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తాజా ప్రెస్ మీట్లో వెల్లడించారు.ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. 

New Update
Balakrishna ntr

Balakrishna ntr

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో నిర్మాత నాగవంశీ సినిమాకు సంబంధించి పలు ఈవెంట్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. 

ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్..

అంతేకాకుండా 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముఖ్యంగా నాగవంశీ.. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. 

నాగవంశీతో ఎన్టీఆర్ కు మంచి బాండింగ్ ఉంది. సో అతను అడిగితే తారక్ కాదనడు. అంటే బాబాయ్ ఈవెంట్ కి అబ్బాయి కచ్చితంగా వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. 

బాలయ్య, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతోంది. నాగవంశీ ప్రయత్నం ఫలిస్తే.. మళ్ళీ నందమూరి హీరోలను ఒకే వేదికపై చూడొచ్చు. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment