JR NTR- Balakrishna: కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్!

తన బాబాయ్‌కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్‌ ఎన్టీఆర్‌,నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వంటి వారు ట్వీట్లు వేసి తమ బాబాయ్‌కి కంగ్రాట్స్ తెలియజేశారు.

New Update
Balakrishna ntr

Balakrishna ntr

Jr.Ntr: నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు వేశారు. బాలా బాబాయ్ కంగ్రాట్స్ అంటూ తమ ఆనందాన్ని తెలియజేశారు. నువ్వు సినీ పరిశ్రమకు చేసిన సేవలు, చేసే సామాజిక సేవలకు నిదర్శనంగా ఈ అవార్డు వచ్చింది అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ ఎక్స్ ఖాతాల్లో రాసుకొచ్చారు.

Also Read: CBSE Exams: 10, 12వ తరగతి పరీక్షలకు కొత్త రూల్స్.. CBSE బోర్డు కీలక ప్రకటన!

 వీరు వేసిన ట్వీట్లతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాలా బాబాయ్‌కి ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ తమ ట్వీట్లలో రాసుకొచ్చారు. ఇక బాలయ్యకు వచ్చిన ఈ పురస్కారం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శక, నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలు కూడా బాలయ్యకు విషెస్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. 

Also Read: Madhya Pradesh: ప్రసాదం గా మద్యం..కానీ బంద్‌ చేసిన సర్కార్‌..మరీ ఆచారం సంగతేంటి!

మీరు అన్ స్టాపబుల్...

నాగవంశీ సంగతి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు అన్నట్లు ఉంది.. ఎప్పటిలానే మీరు అన్ స్టాపబుల్.. మీరు మా గాడ్ ఆఫ్ మాస్.. మీకు ఇలాంటివి ఇంకెన్నో రావాలి అంటూ నాగవంశీ ట్వీట్ వేశాడు. తమన్ అయితే ఈ పురస్కారం రావడం పట్ల తెగ ఆనంద పడిపోతోన్నాడు.బాలయ్య బాబుకి ఈ పురస్కారం ఎంతో అర్హమైనది.. అంటూ రవితేజ ట్వీట్ వేశాడు. 110 చిత్రాలకు పైగా నటించి సినీ రంగంలో విశేషమైన ముద్ర వేశారు బాలయ్య. ఇక రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. 

బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా విశేషమైన సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  Maha Kumbh Mela: మహాకుంభమేళాకు..73 దేశాల నుంచి దౌత్యవేత్తలు!

Also Read: Republic Day Traffic Rules: రిపబ్లిక్ డే వేడుకలు..విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment