అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?

అల్లు అర్జున్ అరెస్ట్ పై జానీ మాస్టర్ ఎట్టకేలకు నోరు విప్పారు. బన్నీ అరెస్ట్ అయినట్ల తెలిసిన వెంటనే, నా మనసులో ఫస్ట్ ఆయన పిల్లలు గుర్తుకు వచ్చారు. నేను కూడా జైలుకు వెళ్లిన‌ప్పుడు నాకు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. వాళ్లు ఏమైపోతారోనని కంగారుపడ్డానంటూ తెలిపారు.

New Update
jani master about allu arjun arrest

jani master about allu arjun arrest

ప్ర‌ముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి, బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన తిరిగి సినిమా షూటింగ్‌ల్లో చేరబోతున్నారని ఇటీవలే ప్రకటించారు. ఈ సమయంలోనే, ఆయన తన డాన్స్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు.

అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అల్లు అర్జున్ అరెస్ట్ గురించి జానీ మాస్టర్ ను మీడియా వాళ్ళు పలుమార్లు అడిగితే ముఖం చాటేశారు. అలాంటిది తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో  బన్నీ అరెస్ట్ పై స్పందించారు. "అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నేను కొన్ని మీమ్స్, సోషల్ మీడియాలో చూసాను. ఆయన అరెస్ట్ అయితే నేను హ్యాపీగా ఉన్నట్టు మీమ్స్ వేశారు. 

Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా?

వాళ్లే గుర్తొచ్చారు..

కానీ ఆయన అరెస్ట్ అయినట్ల తెలిసిన వెంటనే, నా మనసులో ఫస్ట్ ఆయన పిల్లలు గుర్తుకు వచ్చారు. ఎందుకంటే అల్లు అర్జున్ పిల్ల‌లు నాకు తెలుసు. షూటింగ్‌లో వ‌స్తారు అల్ల‌రి చేస్తారు. కానీ వాళ్ల తండ్రి అరెస్ట్ అవ్వ‌గానే వాళ్లు ఎలా ఉంటారో అని ఆలోచించాను. నేను కూడా జైలుకు వెళ్లిన‌ప్పుడు నాకు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. వాళ్లు ఏం అయిపోతారో అని కంగారుపడ్డాను.." అంటూ చెప్పుకొచ్చారు. 

మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని ఇటీవలే జానీ మాస్టర్ పరామర్శించారు. అలాగే వారికి ఆర్ధిక సహాయం కూడా చేస్తానని, వాళ్ళ కుటుంబానికి డ్యాన్స్ అసోసియేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని  తెలిపారు.

Also Read :  140 Kmph వేగంతో స్టార్క్ బంతి..రిషబ్ పంత్ చేతికి గాయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment