Janhvi Kapoor: పో*ర్న్‌ సైట్‌లో నా ఫొటో పెట్టారు.. జాన్వీ కపూర్ ఎమోషనల్

నటి జాన్వీకపూర్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరో తన ఫోటోను మార్ఫింగ్ చేసి ఓ అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిసి షాకైపోయానని తెలిపారు.

New Update
Janhvi Kapoor recalls seeing her morphed image on a porn site at 15

Janhvi Kapoor recalls seeing her morphed image on a porn site at 15

నటి జాన్వీకపూర్ తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. డీప్‌ఫేక్ వల్ల కలిగే ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరో తన ఫోటోను మార్ఫింగ్ చేసి ఓ అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టారని తెలిసి షాకైపోయానని తెలిపారు. ఆ సమయంలో తనకు ఏం జరుగుతుందో అర్థం కాలేదని.. ఆరోజే సోషల్ మీడియాలో నైతికత లేదని అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. తర్వాత రీఎంట్రీ..!

తనని డీప్‌ఫేక్ సమస్య ఇప్పటికీ వేధిస్తూనే ఉందని.. దీంతో మానసిక ప్రశాంతత లేకుండా పోయిందని జాన్వీ ఎమోషనల్ అయ్యారు. కొన్నిసార్లు న్యూస్‌ పేజీల్లో కూడా ఏఐ (AI)తో చేసిన తన ఫోటోలను అసలైనవిగా భావించి ప్రచురిస్తుంటాయని తెలిపారు. ఆ ఫోటోలను తనే స్వయంగా షేర్ చేసినట్లు ప్రచారం చేయడం వల్ల ఇది తన వృత్తిపరమైన జీవితంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమ మార్ఫింగ్‌ ఫొటోల వల్ల తాను ఎంతో ఇబ్బందులు పడ్డానని వివరించారు.

Also Read: గూస్ బంప్స్ తెపిస్తున్న 'రామాయణ' టీజర్‌..

ఈ డీప్‌ఫేక్ వల్ల కలిగే బాధను ప్రపంచానికి గట్టిగా చెప్పాలని ఉందని.. కానీ తన గొంతుక అంతగా వినిపిస్తుందో లేదోనన్న సందేహం ఉందని జాన్వీ తన నిస్సహాయతను తెలియజేశారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ఆమె సినిమాలపై ఫోకస్ పెట్టారు. రామ్‌చరణ్‌ హిరోగా నటిస్తున్న పెద్ది చిత్రంలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు